Gold Price Today: భారీగా దిగొచ్చిన బంగారం ధరలు, పసిడి దారిలోనే క్షీణించిన వెండి ధర

Gold Rate Update 24th January 2021: 

Written by - Shankar Dukanam | Last Updated : Jan 24, 2021, 09:58 AM IST
  • బులియన్ మార్కెట్‌లో మరోసారి క్షీణించిన బంగారం ధరలు
  • తాజాగా 10 గ్రాముల బంగారం ధర రూ.50,130 అయింది
  • తెలుగు రాష్ట్రాల్లో రూ.71 వేలు దాటిన 1 కేజీ వెండి ధరలు
Gold Price Today: భారీగా దిగొచ్చిన బంగారం ధరలు, పసిడి దారిలోనే క్షీణించిన వెండి ధర

Gold Price Today In Hyderabad On 24th January 2021: బులియన్ మార్కెట్‌లో జనవరి చివరి వారంలో బంగారం మిశ్రమంగా నమోదవుతున్నాయి. వెండి ధరలు సైతం బంగారం దారిలోనే పయనిస్తున్నాయి. రెండో వారంలో తొలుత భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు తాజాగా దిగొస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు, వెండి ధరలు పతనమయ్యాయి

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Hyderabad)లలో బంగారం ధర రూ.330 మేర తగ్గింది. నేటి మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు రూ.50,130 అయింది. 22 క్యారెట్లపై రూ.150 తగ్గింది. దీంతో తాజాగా 10 గ్రాముల బంగారం ధర రూ.45,950 అయింది.

Also Read: EPFO Benefits: ఈపీఎఫ్ ఖాతాదారులకు 5 బెనిఫిట్స్..

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర(Gold Price Today On 24th January 2021) రూ.160 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,470 అయింది. అదే సమయంలో 22 క్యారెట్లపై రూ.150 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.48,100కి పతనమైంది.

Also Read: PPO: కేంద్రం శుభవార్త.. పెన్షన్ కోసం ఇక ఆ సమస్య ఉండదు

ఢిల్లీలో వెండి ధర రూ.600 మేర పతనమైంది. నేడు 1 కేజీ వెండి ధర రూ.66,800 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.1,100 మేర దిగొచ్చింది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.71,350కు పతనమైంది.

Also Read: SBI Alert: పాన్ కార్డ్ అప్‌డేట్ చేయకపోతే ఈ ట్రాన్సాక్షన్స్ చేయలేరు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News