Gold Price Today 22nd December 2020: షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే

Gold Rate Update 22nd December 2020: డిసెంబర్ నెలలో బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరగగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు వరుసగా ఆరోరోజు పెరిగాయి. వెండి ధర రూ.74 వేల మార్క్‌కు దగ్గరలో ఉంది.

Last Updated : Dec 22, 2020, 06:20 AM IST
  • బులియన్ మార్కెట్‌లో భారీ పెరుగుతోన్న బంగారం ధరలు
  • తాజాగా బంగారం 10 గ్రాముల ధర రూ.51,380 అయింది
  • మార్కెట్‌లో 1 కేజీ వెండి ధర రూ.74 వేల దిశగా పరుగులు
Gold Price Today 22nd December 2020: షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే

Gold Price Today 22nd December 2020: బంగారం ధరలు డిసెంబర్ నెలలో బులియన్ మార్కెట్‌లో భారీగా పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ సమయం నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరగగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు వరుసగా ఆరోరోజు పెరిగాయి. వెండి ధర రూ.74 వేల మార్క్‌కు దగ్గరలో ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యకేంద్రాలైన విజయవాడ, విశాఖపట్నం‌, హైదరాబాద్‌ (Hyderabad)లలో బంగారం ధర 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.320 మేర పెరగడంతో 10 గ్రాముల పసిడి ధర రూ.51,380 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.290 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.47,100కి ఎగసింది.

Also Read: SBI Cuts Interest Rates: ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త.. ఆ లోన్స్‌పై భారీగా తగ్గిన వడ్డీ రేట్లు

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌‌లో బంగారం ధరలు (Gold Price Today) వారం రోజుల నుంచి వరుసగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.310 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.53,720కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.280 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.49,250 అయింది.

Also Read: EPFO: పీఎఫ్ ఖాతాలో వడ్డీ ఎప్పుడు జమకానుందో తెలుసా?

డిసెంబర్‌లో బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే తాజాగా ఢిల్లీ మార్కెట్‌లో వరుసగా ఆరో రోజు వెండి ధర (Silver Rate in India) పెరిగింది. తాజాగా రూ.2,800 మేర పెరగడంతో బులియన్ మార్కెట్‌లో 1 కేజీ వెండి ధర రూ.70,700 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.73 వేలు దాటింది. తాజాగా రూ.2,100 మేర పెరిగింది. దీంతో ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.73,700 వద్ద మార్కెట్ అవుతోంది.  
Also Read: BSNL Cheapest Plan: తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్.. Airtel, Jio మరియు VIలకు షాక్! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News