Gold Price Today 16 December 2020: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Rate Today In India) స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు యథాతథంగా ఉన్నాయి. మరోవైపు వెండి ధర మరోసారి భారీగా ధర పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో బంగారం ధర (Gold Price Today In Hyderabad) 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.230 మేర తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.49,960 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.45,800కి దిగొచ్చింది.
Also Read: LPG Cylinder Price Hike: ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు.. తాజా ధరలు ఇలా!
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో బంగారం ధరలు (Gold Price in Delhi) మరోసారి స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.230 మేర దిగొచ్చింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.52,310కి పతనమైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.210 దిగిరావడంతో 10 గ్రాముల ధర రూ.47,950కి క్షీణించింది.
Also Read: JEE Main 2021 Registration: జేఈఈ మెయిన్ 2021 రిజిస్ట్రేషన్లు ప్రారంభం
బులియన్ మార్కెట్లో డిసెంబర్లో వెండి ధరలు ఇటీవల తగ్గుతున్నాయి. అయితే తాజాగా ఢిల్లీ మార్కెట్లో వెండి ధర (Silver Rate in India) రూ.950 మేర పుంజుకుంది. దీంతో బులియన్ మార్కెట్లో 1 కేజీ వెండి ధర రూ.64,150కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.4,700 మేర పెరిగింది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.67,900కి అయింది.
Also Read: Postal Life Insurance Benefits: పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తే కలిగే ప్రయోజనాలివే
Read Also: EPFO: మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలియదా.. అయితే UAN యాక్టివేట్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe