Gold Price Today 11 December 2020: మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Rate Update 11th December 2020: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today In India) వరుసగా రెండోరోజు దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు  తగ్గగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు క్షీణించాయి. మరోవైపు వెండి ధర కేవలం వారం రోజుల వ్యవధిలో రూ.8000 మేర పెరిగింది.

Last Updated : Dec 11, 2020, 07:39 AM IST
  • తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధర
  • వెండి ధరలు భారీగా పతనమయ్యాయి
  • నేడు 1 కేజీ వెండి ధర రూ.66,800
Gold Price Today 11 December 2020: మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Price Today 11Th December 2020: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today In India) వరుసగా రెండోరోజు దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు  తగ్గగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు క్షీణించాయి. మరోవైపు వెండి ధర కేవలం వారం రోజుల వ్యవధిలో రూ.8000 మేర పెరిగింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం‌లలో బంగారం ధర (Gold Rate Today In Hyderabad) 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.430 మేర పతనం కావడంతో 10 గ్రాముల ధర రూ.50,070 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 తగ్గడంతో 10 గ్రాములకు రూ.45,900కి దిగొచ్చింది.

దేశ రాజధాని  ఢిల్లీ మార్కెట్‌‌లో బంగారం ధరలు (Gold Price in Delhi) తగ్గాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన  బంగారం ధర రూ.770 మేర దిగిరావడంతో 10 గ్రాముల ధర రూ.52,420కి పతనమైంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ700 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.48,050కి దిగొచ్చింది.

Read Also: EPFO: మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలియదా.. అయితే UAN యాక్టివేట్ చేసుకోండి

గత నెలలో తగ్గిన వెండి ధరలు డిసెంబర్ నెలలో బులియన్ మార్కెట్‌లో పుంజుకుంటున్నాయి. అయితే తాజాగా ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) రూ.1,000 మేర తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో 1 కేజీ వెండి ధర రూ.63,400కి పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర ఏకంగా రూ.1,200 మేర పతనమైంది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.66,800 అయింది.  

Also Read : Second Hand Bike on Lowest Price: తక్కువ ధరలకు సెకండ్ హ్యాండ్ బైక్స్.. ఎన్నో ప్రయోజనాలు  

Also Read : Rise in Prices: టీవీ, ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల ధరలు షాక్.. త్వరలో భారీగా పెంపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News