నవంబర్ నెలలో బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Price Today In India) దిగొచ్చాయి. తాజాగా డిసెంబర్ నెలలో సీన్ రివర్సయింది. తొలి రోజే బంగారం ధర పెరగడంతో మార్కెట్ ముగిసింది. బంగారం ధరలు పెరగగా.. తాజాగా వెండి సైతం బంగారం దారిలోనే పయనించింది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌లలో బంగారం ధర (Gold Rate Today In Hyderabad) రూ.216 మేర పెరిగింది. దీంతో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,980కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,900 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.1,300 పెరగడంతో కేజీ ధర రూ.64,600కి పుంజుకుంది.
ఢిల్లీ మార్కెట్‌లో గత రెండు వారాలుగా తగ్గిన బంగారం ధరలు తాజాగా పెరుగుతున్నాయి. డిసెంబర్ ఆరంభంలో బంగారం ధరలు (Gold Price in Delhi) మార్కెట్‌కు లాభాలు చేకూర్చనున్నాయి. నేటి మార్కెట్‌లో బంగారం ధరలు రూ.220 మేర పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,320కి చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.200 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.47,050కి ఎగసింది.
బులియన్ మార్కెట్‌లో నవంబర్ నెలలో భారీగా క్షీణించిన వెండి ధరలు తాజాగా పుంజుకుంటున్నాయి. తాజాగా డిసెంబర్ ఆరంభంలోనూ వెండి ధర పెరిగింది. తాజాగా ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) రూ.1,900 మేర భారీగా పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో నేడు 1 కేజీ వెండి ధర రూ.60,200కి చేరుకుంది.
- Also Read : LPG Cylinder Cashback Offer: గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ.500 క్యాష్ బ్యాక్!
- Also Read : Best LIC Policies: 5 బెస్ట్ ఎల్ఐసీ పాలసీలు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe