Gold Price Today in India: తగ్గిన బంగారం ధరలు.. భారీగా పతనమైన వెండి ధర

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Price Today In Hyderabad) తాజాగా తగ్గుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా ధర తగ్గగా, ఢిల్లీలో మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. వెండి ధర భారీగా దిగొచ్చింది. ఒకేరోజు రూ.1,000 మేర వెండి ధర పతనమైంది.

Last Updated : Oct 27, 2020, 06:53 AM IST

    బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

    కరోనా వ్యాప్తి సమయంలో భారీగా దిగొస్తున్న వెండి ధరలు

    తాజాగా రూ.1,000 తగ్గడంతో 1 కేజీ వెండి ధర రూ.61,500కి క్షీణించింది

Gold Price Today in India: తగ్గిన బంగారం ధరలు.. భారీగా పతనమైన వెండి ధర

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా దిగొచ్చాయి. అదే సమయంలో వెండి ధరలు బంగారాన్ని అనుసరించాయి. అయితే వెండి ధర భారీగా పతనమైంది. హైదరాబాద్‌ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో తాజాగా బంగారం ధర రూ.100 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,410కి దిగొచ్చింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.90 తగ్గడంతో ధర రూ.47,130 అయింది.

గత కొన్ని రోజులుగా ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate in Delhi) స్థిరంగా కొనసాగుతున్నాయి. గత మూడు రోజులుగా బంగారం ధరలలో ఏ మార్పు లేదు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,890 అయింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,400గా మూడోరోజు కొనసాగుతోంది.

గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్‌లో తగ్గుతూ వస్తున్న వెండి ధరలు (Silver Rate in India) భారీగా క్షీణించాయి. గత రెండు రోజులుగా 1 కేజీ వెండి ధర రూ.62,500 వద్ద మార్కెట్ అవుతున్న వెండి తాజాగా రూ.1000 మేర దిగొచ్చింది. దీంతో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.61,500కి పతనమైంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో మార్కెట్ అవుతుంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News