Gold Price Today In India: భారీగా క్షీణించిన బంగారం ధరలు, వెండి పరుగులు!

గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Price Today In Hyderabad) పతనమవుతున్నాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం స్థిరంగా పెరుగుతున్నాయి. పలు అంశాలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తాయి.

Last Updated : Oct 19, 2020, 07:45 AM IST
  • బులియన్ మార్కెట్‌లో భారీగా పతనమైన బంగారం ధరలు
  • కరోనా వ్యాప్తి సమయంలో స్థిరంగా పెరుగుతున్న వెండి ధరలు
  • తాజాగా మార్కెట్‌లో 1 కేజీ వెండి రూ.1,00 పెరగడంతో ధర రూ.61,700 అయింది
Gold Price Today In India: భారీగా క్షీణించిన బంగారం ధరలు, వెండి పరుగులు!

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) భారీగా పడిపోయాయి. అదే సమయంలో మార్కెట్‌లో వెండి ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో తాజాగా బంగారం ధర రూ.1,890 మేర భారీగా దిగొచ్చింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,050 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,800గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate in Delhi) వరుసగా రెండోరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా బంగారం ధరలలో ఏ మార్పు లేదు. రెండు రోజులనుంచి 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,760 వద్ద కొరసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,290 వద్ద స్థిరంగా మార్కెట్ అవుతోంది.

గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు తగ్గుతున్నాయి. తాజాగా వెండి ధరలు (Silver Rate in India) స్థిరంగా పెరుగుతున్నాయి. తాజాగా వెండి ధర రూ.1,00 మేర పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.61,700వద్ద ట్రేడ్ అవుతోంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర ఉంటుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Trending News