Todays Gold Rate: దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

Todays Gold Rate: బంగారం ధర మరోసారి స్వల్పంగా తగ్గింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. అటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఇతర నగరాలతో పోలిస్తే..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 29, 2021, 06:54 AM IST
Todays Gold Rate: దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

Todays Gold Rate: బంగారం ధర మరోసారి స్వల్పంగా తగ్గింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. అటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఇతర నగరాలతో పోలిస్తే..

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. మార్కెట్‌లో ఒక్కోరోజు బంగారం ధర పెరుగుతుంటే..మరో రోజు తగ్గుతుంటుంది. సిల్వర్ కూడా ఇదే పరిస్థితి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, వివిధ దేశాల మధ్య నెలకొనే భౌతిక పరిస్థితులు, డాలర్ విలువ, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు వంటి చాలా అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే బంగారం ప్రతిరోజూ మారుతుంటుంది. వరుసగా రెండవరోజు బంగారం ధర (Gold Price) స్వల్పంగా తగ్గింది. ఇవాళ దేశవ్యాప్తంగా బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం.

దేశ రాజధాని ఢిల్లీలో (Delhi Gold Price) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 51 వేల 800 గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని  ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 220  రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 220 రూపాయలుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 440 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 580 రూపాయలుగా ఉంది. పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 400 రూపాయలుండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50 వేల 100 రూపాయలుగా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 350 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 480 రూపాయలుంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 350 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 480 రూపాయలుగా ఉంది. 

ఇక తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో (Hyderabad Gold Price) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 350 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 480 రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల  బంగారం 10 గ్రాముల ధర 44 వేల 350 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 480 రూపాయలుంది.

Also read: Xiaomi 12 series: మార్కెట్‌లోకి షియోమి 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు.. ధరలు మాత్రం..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News