Todays Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం, దేశంలో వివిద ప్రాంతాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

Todays Gold Rate: బంగారం ధర స్వల్పంగా పెరిగింది. గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలో ఇవాళ మార్పు కన్పించింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 31, 2022, 07:01 AM IST
Todays Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం, దేశంలో వివిద ప్రాంతాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

Todays Gold Rate: బంగారం ధర స్వల్పంగా పెరిగింది. గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలో ఇవాళ మార్పు కన్పించింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులకు చాలా కారణాలు ప్రభావితం చేస్తుంటాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, డాలర్ విలువ, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, వివిధ దేశాలపై ఆంక్షలు, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం వంటివి ప్రధానంగా ఉంటాయి. అందుకే బంగారం ధర ప్రతిరోజూ మారుతుంటుంది. గత కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఇవాళ స్వల్పంగా పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.(Today January 31, 2022 Gold Rate in Different Cities of India)

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 2 వందలుగా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల రూపాయలుండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 100 రూపాయలుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 90 రూపాయలుగా ఉంది. ఇక పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 140 రూపాయలుంది. ఇక కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 100 రూపాయలుగా ఉంది. 

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర కూడా 45 వేల రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 100 రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 100 రూపాయలుంది. ఇక ఢిల్లీలో కిలో వెండి 61 వేల 2 వందల రూపాయలుంటే..ముంబైలో కూడా అదే ధర కొనసాగుతోంది. చెన్నై, కేరళ, తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి 65 వేల 5 వందల రూపాయలుగా ఉంది. అటు కోల్‌కతాలో కిలో వెండి 61 వేల 2 వందల రూపాయలుగా ఉంది. 

Also read: February 2022 Bank Holidays: ఫిబ్రవరిలో బ్యాంక్ సెలవులు.. రాష్ట్రాల వారీగా పూర్తి వివరాలివే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News