Gold Rate Today 3 March 2022: పసిడి ప్రియులకు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధరలు!!

March 3rd 2022 Gold and Silver Rates In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040గా ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2022, 07:50 AM IST
  • మగువలకు షాక్‌
  • భారీగా పెరిగిన బంగారం ధరలు
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఎంతంటే
 Gold Rate Today 3 March 2022: పసిడి ప్రియులకు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధరలు!!

March 3rd 2022 Gold and Silver Rates In Hyderabad: ఉక్రెయిన్‌, రష్యా దేశాల మధ్య యుద్ధం మొదలైన తర్వాత కూడా కాస్త దిగివచ్చిన బంగారం, వెండి ధరలు గత 3-4 రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. గురువారం (2022 మార్చి 3) కూడా పసిడి, వెండి ధరలు పెరిగాయి. బుధవారంతో పోల్చుకుంటే.. ఈరోజు రూ.1,000 పైగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్ల పతనం బంగారం ధరలను పరుగులు పెట్టిస్తున్నది. 

ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం బంగారం) ధర భారత మార్కెట్లో రూ.47,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,040గా ఉంది. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.1,000.. 24 క్యారెట్ల బంగారంపై రూ.1,090 వరకు పెరిగింది. మరోవైపు వెండి ధరలు కూడా దాదాపుగా రూ.2,200 పెరిగాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 67,200 గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. 
 ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,040గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,040గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,800గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.53,240 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700.. 24 క్యారెట్ల ధర రూ.52,040గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,040గా ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.47,700.. 24 క్యారెట్ల ధర రూ.52,040గా నమోదైంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,040 వద్ద కొనసాగుతోంది. ఇక ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,200గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ.72,100, విజయవాడలో రూ.72,100, విశాఖపట్నంలో రూ.72,100లుగా ఉంది. 

Also Read: Deepak Chahar: ఐపీఎల్ ప్రారంభానికి ముందే చెన్నైకు ఎదురుదెబ్బ.. సగం మ్యాచ్​లకు దీపక్ చాహర్ దూరం..!

Also Read: Horoscope March 3 2022: నేటి రాశిఫలాలు... ఈ రాశివారు అనవసర ఖర్చులు ఎక్కువగా చేస్తారట!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News