Asia's Richest Person: అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ మరో ఘనతను సాధించారు. దేశంలోనే కాకుండా ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించారు.
ఇప్పటి వరకు ఆసియాలో అత్యంత సంపన్నుడిగా ఉన్న రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి ఈ రికార్డును సొంత చేసుకున్నారు గౌతమ్ అదానీ.
ఎవరి సంపద ఎంతంటే..
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. సోమవారం నాటికి గౌతమ్ అదానీ మొత్తం సంపద విలువ 88.5 బిలియన్ డాలర్ల (రూ.6.6 లక్షల కోట్లకు పైమాటే)కు పెరిగింది.
ఇదే సమయంలో ముకేశ్ అంబానీ సంపద విలువ రూ.87.9 బిలియన్ డాలర్లు (రూ.6.2 లక్షల కోట్ల పైమాటే) గా ఉంది.
మరో విశేషమేమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా 2022లో ఇప్పటి వరకు అత్యధికంగా సంపద పెరిగిన వ్యక్తి కూడా గౌతమ్ అదానీనే అని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటి వరకు అదానీ సంపద 12 బిలియన్ డాలర్లు (రూ.89 వేల కోట్లకన్నా ఎక్కువే) పెరిగింది.
అదానీ వ్యాపారాలు ఇవే..
అదానీ వ్యాపారాలు గుజరాత్‌లోని అహ్మదాబాద్ కేంద్రంగా పని చేస్తాయి. అదానీ వ్యాపారాల్లో ముఖ్యమైనవి పోర్ట్స్, విద్యుత్, మైనింగ్, పునరుత్పాదక విద్యుత్, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫుడప్ ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాలు.
అంబానీ వ్యాపారాలు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరుతో అదానీ వ్యాపారాలు నడుస్తాయి. ముంబయి కేంద్రంగా ఈ గ్రూప్ కార్యకలాపాలు సాగుతుంటాయి.
రిలయన్స్ గ్రూప్‌లో పెట్రోలియం, సహజవాయు, పెట్రో కెమిమికల్స్, టెలికాం, టెక్స్టైల్స్, రిటైల్, మీడియా, టెలివిజన్ ఎంటర్టైన్మెంట్, ఫినాన్షియల్ సర్వీసులు ముఖ్యమైన వ్యాపారాలు.
Also read: iPhone 13 Price Drops: రూ.74,900 విలువైన ఐఫోన్ 13ను రూ.52,305కే కొనండిలా!
Also read: Jio Free Services: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ రెండు రోజులు అన్ని సర్వీసులు ఉచితం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook