Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్... రూ.48వేల రియల్‌మీ ఏసీ ఇప్పుడు రూ.26వేలకే...

Flipkart Realme AC Discount: ఫ్లిప్‌కార్ట్ సూపర్ కూలింగ్ డేస్ ఆఫర్‌కి ఇదే చివరి రోజు. మీరు ఏసీ, రిఫ్రిజిరేటర్స్ లాంటివి కొనుగోలు చేయాలనుకుంటే వెంటనే త్వరపడండి..

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 25, 2022, 12:00 PM IST
  • ఫ్లిప్‌కార్ట్ బిగ్ డిస్కౌంట్ ఆఫర్
  • సూపర్ కూలింగ్ సేల్ కింద భారీ రాయితీ
  • రిఫ్రిజిరేటర్స్, ఏసీలపై డిస్కౌంట్ వర్తింపు
Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్... రూ.48వేల రియల్‌మీ ఏసీ ఇప్పుడు రూ.26వేలకే...

Flipkart Realme AC Discount: ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం 'సూపర్ కూలింగ్ డేస్' సేల్ జరుగుతోంది. రిఫ్రిజిరేటర్లు, ఏసీలపై ఈ సేల్ కింద భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్‌కు ఇవాళే చివరి రోజు. మీరు కొత్త ఏసీని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఇవాళే త్వరపడండి. ఫ్లిప్‌కార్ట్‌లో చౌక ధరలో అందుబాటులో ఉన్న 'రియల్‌మీ టెక్‌లైఫ్ ఫోర్ ఇన్ వన్ కన్వర్టబుల్ 1 టన్ స్టార్ స్ప్లిట్ ఏసీ' డిస్కౌంట్ ఆఫర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని ధర రూ.48 వేలు కాగా.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.26వేలకే అందుబాటులో ఉంది.

ఫ్లిప్‌కార్ట్ సూపర్ కూలింగ్ డేస్:  

'రియల్‌మీ టెక్‌లైఫ్ ఫోర్ ఇన్ వన్ కన్వర్టబుల్ 1 టన్ స్టార్ స్ప్లిట్ ఏసీ ప్రారంభ ధర రూ. 47,999. ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై 42 శాతం డిస్కౌంట్ ఉంది. డిస్కౌంట్ పోను రూ. 27,790కే ఏసీని కొనుగోలు చేయవచ్చు. మీరు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డును ఉపయోగించినట్లయితే మరింత డిస్కౌంట్ పొందుతారు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో ఏసీపై రూ.1750 మేర డిస్కౌంట్ పొందుతారు. ఈ ఆఫర్‌తో ఏసీ మీకు రూ.26,040కే లభిస్తుంది.

రియల్‌మీ టెక్‌లైఫ్ ఫోర్ ఇన్ వన్ కన్వర్టబుల్ 1 టన్ 4 స్టార్ స్ప్లిట్ ఏసీపై ఒక సంవత్సరం వారంటీ ఉంటుంది. అలాగే, కంప్రెసర్‌పై 10 సంవత్సరాల వారంటీ ఉంటుంది. ఈ ఏసీ ఫోర్ స్టార్ రేటింగ్‌ కలిగి ఉంది. తద్వారా త్వరగానే గదిని చల్లబరుస్తుంది. ఇది మాత్రమే ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ కూలింగ్ డేస్ ఆఫర్ కింద వివిధ బ్రాండ్లకు చెందిన కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, పోర్టబుల్ ఫ్యాన్లు, పోర్టబుల్ ఏసీలు చౌక ధరలో అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఫ్లిప్‌కార్ట్ అధికారిక సైట్‌ను సందర్శించండి.

Also Read: KL Rahul Banned: లక్నో సారధికి 24 లక్షల పెనాల్టీ..మ్యాచ్‌పై బ్యాన్

Also Read: Horoscope Today April 25 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారి కష్టానికి తగిన ఫలితం దక్కే రోజు ఇది...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News