Flipkart Offers: ఐఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్స్.. రూ.65 వేలు విలువ చేసే ఐఫోన్ 12 అతి చౌక ధరకే..

Flipkart Offers: మీరు యాపిల్ ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో మీకోసం బిగ్ డిస్కౌంట్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 16, 2022, 02:17 PM IST
  • ఫ్లిప్‌కార్ట్ లేటెస్ట్ ఆఫర్స్
  • స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపుతో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్
  • యాపిల్ ఐఫోన్ 12పై డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్
  • రూ.65 వేలు విలువ చేసే యాపిల్ ఐఫోన్ 12 కేవలం రూ.39 వేలకే
Flipkart Offers: ఐఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్స్.. రూ.65 వేలు విలువ చేసే ఐఫోన్ 12 అతి చౌక ధరకే..

Flipkart Offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల వెల్లువ కొనసాగుతోంది. బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపుతో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందిస్తోంది. యాపిల్ ఐఫోన్లపై సైతం బెస్ట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. రూ.65,900 విలువ చేసే యాపిల్ ఐఫోన్‌పై బిగ్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్స్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్లయితే అతి చౌకగా రూ.39 వేలకే ఈ ఐఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ ఐఫోన్ 12పై 18 శాతం డిస్కౌంట్ :

యాపిల్ ఐఫోన్ 12 (Black, 64 GB) సాధారణ ధర రూ.65,900. ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై 18 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్‌తో యాపిల్ ఐఫోన్ 12ని రూ.53,999కే పొందవచ్చు. అంతేకాదు, ఈ ఐఫోన్ కొనుగోలుకు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడినట్లయితే రూ.2250 వరకు తక్షణ తగ్గింపు పొందవచ్చు. అలా ఈ స్మార్ట్ ఫోన్‌ని రూ.51,749కే కొనుగోలు చేయవచ్చు.

 

భారీ ఎక్స్‌చేంజ్ ఆఫర్ :

ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ ఐఫోన్ 12 (Black, 64 GB)పై ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత మొబైల్ ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. మొబైల్ కండిషన్‌ను బట్టి రూ.12,500 వరకు తగ్గింపు పొందుతారు. ఒకవేళ పూర్తి ఆఫర్ వర్తించినట్లయితే.. రూ.53,999కి అందుబాటులో ఉన్న ఈ ఐఫోన్‌ని రూ.41,499కే పొందవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ కొనుగోలుకు మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించినట్లయితే మరో రూ.2250 వరకు తగ్గింపు పొందుతారు. ఈ ఆఫర్ కూడా వర్తించినట్లయితే.. రూ.39,249కే ఈ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు. అయితే డిస్కౌంట్ ఆఫర్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కి షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి. 

Also Read: Minister KTR Tweet: ప్రధాని మోదీ, అదానీ గ్రూప్‌ మధ్య ఏముంది..కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..!

Also Read: Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్స్.. రూ.24 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ కేవలం రూ.7449కే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News