Apple iPhone 13: యాపిల్ ఐఫోన్ 13పై బంపరాఫర్.. రూ.29 వేల వరకు తగ్గింపు..

Apple iPhone 13 for Low Price: యాపిల్ ఐఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే మీకోసం ఫ్లిప్‌కార్ట్‌లో అతిచౌక ధరకే ఐఫోన్ 13 అందుబాటులో ఉంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 31, 2022, 11:06 AM IST
  • యాపిల్ ఐఫోన్ 13పై భారీ తగ్గింపు
  • రూ.29 వేల వరకు డిస్కౌంట్ పొందే ఛాన్స్
  • కేవలం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే
Apple iPhone 13: యాపిల్ ఐఫోన్ 13పై బంపరాఫర్.. రూ.29 వేల వరకు తగ్గింపు..

Apple iPhone 13 for Low Price: ఆండ్రాయిడ్.. ఐఫోన్.. ఈ రెండింటిలో ఏది మీ ఆప్షన్ అంటే ఎక్కువమంది ఐఫోన్ అంటారు. అయితే ధర కారణంగా చాలామంది ఐఫోన్ కొనుగోలు చేసేందుకు వెనుకడుగు వేస్తారు. కానీ ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈకామర్స్ సంస్థలు ఐఫోన్లపై కూడా భారీ తగ్గింపు అందిస్తున్నాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే ధరలోనే ఐఫోన్‌ను కూడా కొనుగోలు చేసే ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13పై ఇలాంటి ఆఫరే అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ద్వారా ఐఫోన్ 13పై రూ.29 వేల వరకు తగ్గింపు పొందవచ్చు.

డిస్కౌంట్‌తో రూ.9 వేల వరకు తగ్గింపు :

యాపిల్ ఐఫోన్ 13 అసలు ధర రూ.79,900. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో 7 శాతం డిస్కౌంట్‌తో రూ.73,909కే ఐఫోన్ 13 అందుబాటులో ఉంది. అంటే.. రూ.5991 వరకు ఆదా అవుతుంది. అంతేకాదు, ఈ ఐఫోన్ కొనుగోలుకు మీరు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ వాడినట్లయితే మరో రూ.4 వేలు వరకు తక్షణ తగ్గింపు పొందవచ్చు. తద్వారా ఐఫోన్ 13ని మరింత చౌకగా రూ.69,909కే కొనుగోలు చేయవచ్చు. దీనిపై నోకాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది. 

ఎక్స్‌చేంజ్‌తో రూ.19 వేల తగ్గింపు :

యాపిల్ ఐఫోన్‌ 13పై ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. మీ పాత ఫోన్‌ని మార్చుకోవడం ద్వారా గరిష్ఠంగా రూ.19 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఎక్స్‌చేంజ్ కోసం మీరిచ్చే మొబైల్ కండిషన్‌ని బట్టి తగ్గింపు ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పూర్తి ఎక్స్‌చేంజ్ ఆఫర్ వర్తించినట్లయితే రూ.73,909కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌‌ను కేవలం రూ.54,909కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఐఫోన్‌ కొనుగోలుకు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు వాడితే మరో రూ.4 వేలు వరకు తగ్గింపు పొందగలరు. ఒకవేళ పూర్తి డిస్కౌంట్ లభించినట్లయితే ఈ ఐఫోన్‌ను మరింత చౌకగా రూ.50,909కే కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ 13 ఫీచర్స్ :

128 జీబీ స్టోరేజ్
6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే
12 MP + 12 MP కెమెరా సెటప్
ఏ 15 బయోనిక్ చిప్ ప్రాసెసర్ 

Also Read: IT Returns:ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లుకు ఇవాళే డెడ్ లైన్..  పొడిగింపు ఉండదట! ఇప్పటివరకు ఐదు కోట్లపైగా ఐటీఆర్‌ల దాఖ‌లు..   

Also Read: Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌ లో భారత్‌కు నాలుగో పతకం.. వెయిట్‌ లిఫ్టర్ బింద్యారాణికి రజతం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News