Flipkart iPhone 12: ఐఫోన్ కొనాలనుకుంటున్నారా.. ఫ్లిప్‌కార్ట్‌ స్పెషల్ ఆఫర్‌తో చౌక ధరకే కొనుగోలు చేసే ఛాన్స్..

Apple iPhone 12 at Low Price: ఐఫోన్ అంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు.. కానీ ధర కారణంగా చాలామంది దాన్ని కొనుగోలు చేసేందుకు వెనక్కి తగ్గుతారు. అలాంటివారి కోసం ఫ్లిప్‌కార్ట్ బిగ్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందిస్తోంది. ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 23, 2022, 03:44 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రానిక్స్ సేల్ ప్రారంభం
  • నేటి నుంచి జూన్ 26 వరకు
  • స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లు ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపు
  • ఐఫోన్లపై కూడా భారీ తగ్గింపు అందిస్తోన్న ఫ్లిప్‌కార్ట్
Flipkart iPhone 12: ఐఫోన్ కొనాలనుకుంటున్నారా.. ఫ్లిప్‌కార్ట్‌ స్పెషల్ ఆఫర్‌తో చౌక ధరకే కొనుగోలు చేసే ఛాన్స్..

Apple iPhone 12 at Low Price: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ప్లాట్‌ఫామ్‌లో ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ సేల్ అందుబాటులో ఉంది. అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై ఈ ఆఫర్‌లో భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. స్మార్ట్ ఫోన్ల విషయానికొస్తే బడ్జెట్ ఫోన్ల నుంచి యాపిల్ ఐఫోన్ల వరకు భారీ తగ్గింపుతో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా యాపిల్ ఐఫోన్ అంటే చాలామంది ఇష్టపడుతారు. కానీ ధర కారణంగా ఐఫోన్ కొనుగోలు చేసేందుకు వెనక్కి తగ్గుతారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఆఫర్‌లో ఐఫోన్లపై భారీ డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్‌ ద్వారా రూ.70,900 విలువైన ఐఫోన్ 12ని కేవలం రూ.45,999కే మీ సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఐఫోన్ 12పై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ ఆఫర్ : 

ఐఫోన్ 12 (128 జీబీ) సాధారణ ధర రూ.70,900. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై 16 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంటే రూ.11,901 మేర ఆదా అవుతుంది.ఈ డిస్కౌంట్ వర్తించినట్లయితే ఐఫోన్ 12ని రూ.58,999కే కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు మీరు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడినట్లయితే రూ.1000 వరకు అదనపు డిస్కౌంట్ పొందుతారు. ఇది కూడా పూర్తి ఆఫర్ లభించినట్లయితే రూ.57,999కే ఐఫోన్ 12ని కొనుగోలు చేయవచ్చు.

ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో భారీ తగ్గింపు :

ఐఫోన్ 12 (128 జీబీ)పై ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఇందుకోసం మీ పాత ఫోన్‌ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ ఫోన్ కండిషన్‌ సరిగా ఉన్నట్లయితే రూ.12,500 వరకు ఎక్స్‌చేంజ్ ఆఫర్ లభిస్తుంది. ఒకవేళ పూర్తి ఆఫర్ లభించినట్లయితే ఫ్లిప్‌కార్ట్‌లో రూ.58,999కి అందుబాటులో ఉన్న ఐఫోన్ 12ని కేవలం రూ.46,499కే కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ ఎస్‌బీఐ కార్డుతో దీని కొనుగోలు జరిపినట్లయితే రూ.1000 అదనపు డిస్కౌంట్ పొందుతారు. అంటే.. రూ.45,4999కే ఈ ఫోన్‌ని మీ సొంతం చేసుకోవచ్చు. అయితే ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కు షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి. అంతేకాదు, ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. జూన్ 23 నుంచి జూన్ 26 వరకు మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

 

Also read:Edible Oil Prices: గుడ్ న్యూస్.. తగ్గిన వంట నూనెల ధరలు.. ఏయే బ్రాండ్స్‌పై ఎంత తగ్గిందో తెలుసా..  

Also read:Film Federation: టాలీవుడ్‌లో రేపటి నుంచి సినిమా షూటింగ్‌లు..సమ్మె విరమించిన కార్మికులు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News