Flipkart Big Saving Days 2023: ఊహించని డిస్కౌంట్లు, 79 వేల ఐఫోన్ 13 కేవలం 20 వేలకే

Flipkart Big Saving Days 2023: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి ధమాకా సేల్ ప్రారంభమౌతోంది. ఫ్లిప్‌కార్ట్ బిగా్ సేవింగ్ డేస్ సేల్ మరో మూడ్రోజుల్లో అందుబాటులో రానుంది.  ఐదురోజులు కొనసాగే ఈ ధమాకా సేల్‌లో భారీ డిస్కౌంట్లు అందనున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 12, 2023, 04:16 PM IST
Flipkart Big Saving Days 2023: ఊహించని డిస్కౌంట్లు, 79 వేల ఐఫోన్ 13 కేవలం 20 వేలకే

Flipkart Big Saving Days 2023: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ జూలై 15 న ప్రారంభమై జూలై 19 వరకూ కొనసాగనుంది. వివిధ రకాల స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఫర్నీచర్స్‌పై భారీ డిస్కౌంట్ అందనుంది. కొన్ని టీవీలపై అయితే నమ్మశక్యం కాని స్థాయిలో డిస్కౌంట్లు ఆఫర్లు లభించనున్నాయి.

జూలై నెల వచ్చిందంటే చాలు ప్రముఖ ఈ కామర్స్ వేదికలు భారీ ఆఫర్లతో ముందుకొస్తుంటాయి. అదే విధంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు మరోసారి ధమాకా ఆఫర్లతో బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. ఇందులో వివిధ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై 43 శాతం డిస్కౌంట్ అందనుంది. అదే విధంగా టీవీలు ఇతర అప్లయన్సెస్‌పై 75 శాతం డిస్కౌంట్ లభించనుంది. కేవలం టీవీలు, స్మార్ట్‌ఫోన్లపైనే కాకుండా అన్ని రకాల ఉత్పత్తులపై ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు లభించనున్నాయి. ఫర్మీచర్‌పై 80 సాతం, బ్రాండెడ్ దుస్తులపై 50 -80 శాతం, ఎలక్ట్రానికి వస్తువులపై 80 శాతం రిఫ్రిజిరేటర్లపై 60 శాతం ఇలా కలలో కూడా ఊహించని డిస్కౌంట్ లభిస్తోంది. దీనికితోడు వివిధ బ్యాంకులు కూడా ఆఫర్లు ఇస్తున్నాయి. 

బజాజ్ ఫిన్‌సర్వ్ కార్డు ద్వారా నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కలగనుంది. పేటీఎం పేమెంట్స్ ద్వారా రాయితీలు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఆప్షన్‌తో లక్ష రూపాయల వరకూ క్రెడిట్ అందుతుంది. ఇక ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం అన్ లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభించనుంది. దీంతోపాటు 16 శాతం సూపర్ కాయిన్స్ పొందవచ్చు. ఇదే యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా చెల్లింపు చేస్తే 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఇలా వివిధ బ్యాంకులు వివిధ రకాల ఆఫర్లు అందిస్తున్నాయి. 

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై 43 శాతం డిస్కౌంట్ ఉంటుంది. ఐఫోన ప్రేమికులకు మరో అద్బుతమైన ఆఫర్ లభించనుంది. ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 20,999 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. అంటే 79,900 ఖరీదైన ఐఫోన్ 13ను అన్ని ఆఫర్లు కలుపుకుంటే ఏకంగా 58,901 రూపాయుల డిస్కౌంట్ లభిస్తుంది. ఇది ఐఫోన్ ప్రేమికులకు నిజంగా గుడ్‌న్యూస్. 

ఈసారి ఏసీ క్లియరెన్స్ సేల్ కూడా అందుబాటులో ఉండనుందని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. అంటే ఏసీలు భారీ తగ్గింపు ధరకు లభించవచ్చు. అదేవిధంగా బ్యూటీ కేర్, ఫుడ్, స్పోర్ట్స్ వస్తువులు 99 రూపాయల్నించి లభించనున్నాయి. 

Also read: Amazon Prime Day Sale 2023: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో పిచ్చెకించే ఆఫర్స్‌, డెడ్‌ ఛీప్‌ ధరలకే ఈ స్మార్ట్ ఫోన్స్‌/p>

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News