Flipkart Big Bachat Dhamaal: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బచత్ ధమాల్ సేల్... రేపటి నుంచి ఆఫర్ల జాతరే...

Flipkart Big Bachat Dhamaal: ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి ఆఫర్ల జాతర మొదలుకానుంది. రేపటి (జూలై 1) నుంచి మూడు రోజుల పాటు బిగ్ బచత్ ధమాల్ సేల్ ఆఫర్ అందుబాటులోకి రానుంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jun 30, 2022, 02:40 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌లో మళ్లీ బిగ్ బచత్ ధమాల్ సేల్
  • రేపటి నుంచి ఆఫర్లే ఆఫర్లు
  • షూస్ మొదలు స్మార్ట్ ఫోన్ల వరకు ఎన్నో వస్తువులపై భారీ ఆఫర్స్
Flipkart Big Bachat Dhamaal: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బచత్ ధమాల్ సేల్... రేపటి నుంచి ఆఫర్ల జాతరే...

Flipkart Big Bachat Dhamaal: ఫ్లిప్‌కార్ట్‌లో 'బిగ్ బచత్ ధమాల్' సేల్ పేరిట మరోసారి ఆఫర్ల జాతర మొదలుకానుంది. ప్రతీ నెలా మొదటి 3 రోజులు ఫ్లిప్‌కార్ట్ ఈ ఆఫర్‌ను అందిస్తోంది. జూలై 1 నుంచి 3 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఇందులో భాగంగా షూస్ దగ్గరి నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు ఎన్నో వస్తువులపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. రూ.99 మొదలు రూ. 1 లక్ష విలువ చేసే వస్తువుల వరకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ డిస్కౌంట్ అందిస్తోంది. 

షూస్, దుస్తులు, బెడ్ షీట్స్, కర్టైన్స్, డెకరోటివ్ లైటింగ్, వాల్‌పేపర్ స్టిక్కర్స్, యాక్సెసరీస్, హెల్త్ మానిటర్స్, మొబైల్ కేబుల్స్, వాటర్ గీజర్స్, వార్డ్ రోబ్, పరుపులు, కిచెన్ వస్తువులు, ఫర్నీచర్, స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు,రిఫ్రిజిరేటర్లు తదితర వస్తువులు బిగ్ బచత్ ధమాల్‌లో సేల్‌లో చౌక ధరకే అందుబాటులో ఉన్నాయి. కొన్ని వస్తువులపై దాదాపు 70 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

స్మార్ట్ ఫోన్లలో రియల్‌మీ, ఐఫోన్, పోకో, శాంసంగ్ బ్రాండ్లకు చెందిన పలు మోడల్స్‌పై భారీ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ సద్వినియోగం చేసుకున్నట్లయితే మీ ఫేవరెట్ బ్రాండ్స్‌ను డెడ్ చీప్ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. అయితే ఇది లిమిటెడ్ ఆఫర్ కాబట్టి మూడు రోజులు మాత్రమే ఉంటుంది. ఈ మూడు రోజుల్లో ఆర్డర్ బుక్ చేస్తేనే ఆఫర్ వర్తిస్తుంది. 

Also Read: Amazon Mobile Offers: డెడ్‌ చీప్‌.. రూ.17 వేలు విలువ చేసే 5జీ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.999కే..

Also Read: Sanjay Raut: అంతా కలిసి ఉద్దవ్ ఠాక్రేకు వెన్నుపోటు పొడిచారు..సంజయ్ రౌత్ హాట్ కామెంట్స్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News