ESIC Recruitment 2024: ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసీ రిక్రూట్‌మెంట్ 2024 జారీ అయింది. సీనియర్ రెసిడెంట్ల ఖాళీల్ని భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు కావల్సిన అర్హత, జీతం వివరాలు, ఎవరు అప్లై చేయాలనేది esic.gov.in. పోర్టల్ ద్వారా పూర్తిగా తెలుసుకోవచ్చు. అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు మార్చ్ 6 వరకూ అంటే మరో రెండ్రోజులే గడువుంది.
ఈఎస్ఐసీ రిక్రూట్‌మెంట్ 2024 లో మొత్తం 30 సీనియర్ రెసిడెంట్ ఖాళీలు ఉన్నాయి. 7వ వేతన సంఘం లెవెల్ 11 ప్రకారం జీతభత్యాలుంటాయి. ఈ ఉద్యోగులకు జీతం నెలకు 67,700 రూపాయలుంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు వయసు 45 ఏళ్లు దాటకూడదు. అన్నింటికంటే ప్రయోజనం కల్గించే విషయమేంటంటే ఈ ఉద్యోగాల భర్తీకు రాత పరీక్ష ఉండదు. పూర్తిగా ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక ఉంటుంది. సాధారణ అభ్యర్ధులకు అప్లికేషన్ ఫీజు 500 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, మహిళా అభ్యర్ధులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు ఎలాంటి ఫీజు లేదు.
ఆసక్తి కలిగిన అర్హత ఉన్న అభ్యర్ధులకు చెన్నైలోని ఈఎస్ఐసీ కార్యాలయంలో వాక్ ఇన్ ఇంటర్వూలు 6వ తేదీన ఉంటాయి. చెన్నైలోని కేకే నగర్, ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మార్చ్ 6వ తేదీ ఉదయం 9 గంటల్నించి 11 గంటల వరకు మాత్రమే ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
Also read: Google Layoffs: జీతభత్యాలు పెంచమన్న పాపానికి ఉద్యోగుల ఉద్వాసన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook