PF Transfer: ఈపీఎఫ్ఓ అప్‌డేట్, పాత కంపెనీ పీఎఫ్ ఎక్కౌంట్‌ను కొత్త కంపెనీకు ఎలా మార్చడం

PF Transfer: ఉద్యోగులకు పీఎఫ్ ఎక్కౌంట్ అనేది చాలా కీలకం. ప్రతి నెలా కష్టపడి పొదుపు చేసుకునే అద్భుతమైన పథకం. భవిష్యత్ సురక్షణ కోసం ఉపయోగపడేది. తరచూ ఉద్యోగాలు మారుతుంటే ఎలా మరి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 15, 2023, 01:23 PM IST
PF Transfer: ఈపీఎఫ్ఓ అప్‌డేట్, పాత కంపెనీ పీఎఫ్ ఎక్కౌంట్‌ను కొత్త కంపెనీకు ఎలా మార్చడం

పీఎఫ్ అనేది ఇప్పుడు ఎన్ని కంపెనీల్లో ఉద్యోగం మారినా..ఒకటే పీఎఫ్ ఎక్కౌంట్‌కు మీ ఖాతాను మార్చుకోవచ్చు. దీనికి సంబంధించి ఈపీఎఫ్ఓ కార్యాలయం ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తోంది. ఉద్యోగం మారినా పాత కంపెనీ పీఎఫ్‌ను కొత్త కంపెనీకు ఎలా మార్చుకోవచ్చనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఉద్యోగులకు ముఖ్యంగా ప్రైవేటు కంపెనీ ఉద్యోగులకు పీఎఫ్ సంబంధిత విషయాల్లో చాలా సందేహాలుంటాయి. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకు మారినప్పుడు పాత కంపెనీ పీఎఫ్‌ను ఎలా బదిలీ చేసుకోవాలనేది ముఖ్యంగా ఎదురయ్యే ప్రశ్న. అందుకే ఈపీఎఫ్ఓ కార్యాలయం కీలకమైన సమాచారం వెలువరించింది. దీని ప్రకారం ఇక క్షణాల్లోనే మీరు పాత పీఎఫ్‌ను బదిలీ చేసుకోవచ్చు. ఎన్ని కంపెనీలు మారినా..పాత కంపెనీ పీఎఫ్ బ్యాలెన్స్ ప్రస్తుతం ఉన్న కంపెనీకు మార్చుకోవచ్చు. 

గతంలో పనిచేసిన పాత కంపెనీ పీఎఫ్ బదిలీ చేసేందుకు మీకు యాక్టివ్ యూఎన్ నెంబర్, పాస్‌వర్డ్ ఉంటే చాలు. అది కాకుండా మీ యూఏఎన్ నెంబర్‌లో బ్యాంక్ ఎక్కౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ వంటి వివరాలన్నీ అప్‌డేట్ అయి ఉండాలి. 

పీఎఫ్ ఎక్కౌంట్ బ్యాలెన్స్ చెక్ 

ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్  https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీ యూఎన్ నెంబర్, పాస్‌వర్డ్ , క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ కావాలి. హోమ్ పేజ్‌లో మెంబర్స్ ప్రొఫైల్ క్లిక్ చేసి..మీ వ్యక్తిగత వివరాలు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీ పేరు ఆధార్ వివరాలు, పాన్‌కార్డ్ వివరాలు వెరిఫై చేసుకోవాలి. తరువాత ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, బ్యాంక్ ఎక్కౌంట్ వివరాలు కూడా చెక్ చేసుకోవాలి. పీఎఫ్ బదిలీ చేసేముందు పాస్‌బుక్ ఒకసారి చెక్ చేసుకోవాలి. దీనికోసం వ్యూ ఆప్షన్ క్లిక్ చేస్తే పాస్‌బుక్ ఆప్షన్ కన్పిస్తుంది. దానిపై క్లిక్ చేసి..మరోసారి లాగిన్ కావాలి. సెలెక్ట్ మెంబర్ ఐడీ క్లిక్ చేసే మొత్తం పేజ్ ఓపెన్ అవుతుంది. 

గతంలో మీరు పని చేసిన కంపెనీల మెంబర్ ఐడీలు కన్పిస్తాయి. ఇందులో కింద కన్పించే మెంబర్ ఐడీ ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీది. ఇక్కడ వ్యూ పాస్‌బుక్‌లో క్లిక్ చేస్తే..అన్ని కంపెనీల పీఎఫ్ బ్యాలెన్స్ కన్పిస్తుంది. 

పీఎఫ్ ఎక్కౌంట్ బదిలీ విధానం

ఉద్యోగులు తమ పాత పీఎఫ్ ఎక్కౌంట్ బదిలీ చేసేముందు ఎంట్రీ, ఎగ్జిట్ డేట్ అప్‌డేట్ కావాలి. వ్యూ ఆప్షన్ క్లిక్ చేసి..సర్వీస్ హిస్టరీ ఆప్షన్‌లో వెళ్లాలి. మీ పాత కంపెనీ రెండు తేదీల్ని అప్‌డేట్ చేసుంటే..మీ పీఎఫ్ సులభంగా బదిలీ అవుతుంది. మీరు ఆన్‌లైన్ సర్వీసెస్‌లో వెళ్లి..ONE MEMBER ONE EPF ACCOUNT క్లిక్ చేయాలి. ఇప్పుుడు మీ ముందు ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ వ్యక్తిగత సమాచారముంటుంది. ఇది కాకుండా..ప్రస్తుత కంపెనీ పీఎఫ్ ఎక్కౌంట్ వివరాలుంటాయి. 

ఇదే విండోలో పాత ఎంప్లాయర్ వివరాలుంటాయి. ఈ వివరాల సహాయంతో పీఎఫ్ బదిలీ అవుతుంది. ఇక్కడ పీఎఫ్ బదిలీ చేసుకునేవాళ్లు ప్రస్తుత కంపెనీ లేదా పాత ఎంప్లాయర్ నుంచి అనుమతి తీసుకోవాలి. ఆ తరువాత యూఏఎన్ వివరాలు ఎంటర్ చేయాలి. ఇలా చేయగానే..గతంలో చేసిన అన్ని కంపెనీల పీఎఫ్ ఐడీలు కన్పిస్తాయి. ఏ డబ్బులు బదిలీ చేయాలో..దాన్ని సెలెక్ట్ చేయాలి. తరువాత ఓటీపీ ద్వారా నిర్ధారించుకుంటే చాలు..మీ బదిలీ ప్రక్రియ పూర్తయినట్టే.

Also read: Post office Schemes: నెలకు 15 వందల పొదుపు చేయండి చాలు..మెచ్యూరిటీ అనంతరం 35 లక్షలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News