EPFO has credited an interest rate of 8.50 per cent in 23.34 crore accounts: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ చేస్తున్నట్లు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) ప్రకటించింది. ఇప్పటి వరకు మొత్తం 23.34 కోట్ల ఖాతాల్లో (EPFO interest) 8.50 శాతం చొప్పున వడ్డీని జమ చేసినట్లు సోమవారం తెలిపింది. ఈపీఎఫ్ఓ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వివరాలను వెల్లడించింది.
23.34 crore accounts have been credited with an interest of 8.50% for the FY 2020-21. @LabourMinistry
@esichq @PIB_India @byadavbjp @Rameswar_Teli— EPFO (@socialepfo) December 13, 2021
2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్ చందాదారులకు 8.5 శాతం వడ్డీ (EPFO interest rate for FY21) చెల్లించాలని ధర్మకర్తల బోర్డు ఈ ఏడాది మార్చిలో నిర్ణయించింది. అక్టోబర్‌లో ఇందుకు కేంద్రం ఆమోదం కూడా తెలిపింది. దీనితో తాజాగా లబ్ధిదారుల ఖాతాల్లో వడ్డీని జమ చేసింది ఈపీఎఫ్ఓ.
పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా..
పీఎఫ్ బ్యాలెన్స్‌ను నాలుగు విధాలుగా చెక్ చేసుకోవచ్చు.
1. EPFOHO UAN అని టైప్ చేసి 7738299899 నంబర్‌కు.. రిజిస్ట్రర్ మొబైల్ నంబర్ నుంచి ఎస్ఎంఎస్ పంపడం ద్వారా (EPF SMS service) కూడా.. బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు.
2. ఈపీఎఫ్ఓ టోల్ ఫ్రీ నంబర్ '011-22901406' కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా (EPF missed call service) ఎస్ఎంఎస్ రూపంలో పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ వివరాలను పొందొచ్చు. అయితే ఈపీఎఫ్ఓ వద్ద రిజిస్ట్రర్ అయిన మొబైల్ నంబర్ నుంచి మాత్రమే ఈ సదుపాయం వినియోగించుకునేందుకు వీలుంది.
Get your #PF Balance details by just giving a missed call on 011-22901406 from registered mobile number.#EPFO #EPF #SocialSecurity #Services pic.twitter.com/HHbZfkFXZm
— EPFO (@socialepfo) December 8, 2021
3.ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్‌లోకి లాగిన్ అవడం ద్వారా. పాస్‌బుక్‌ను యాక్సెస్ చేయొచ్చు. ఇందులో ప్రతి నెల ఎంత మొత్తం పీఎఫ్ జమ అవుతుంది. ఉద్యోగి వాటా ఎంత? కంపెనీ వాటా ఎంత? సహా ఇప్పటి వరకు జమ అయిన వడ్డీ వంటి వివరాలను కూడా తెలుకునే అవకాశముంది.
4. ఉమాంగ్ యాప్ ద్వారా కూడా పీఎఫ్ పాస్‌బుక్‌ను యాక్సెస్ చేయొచ్చు (EPF balance with UMANG app). అయితే ముందుగా ఉమాంగ్‌లో రిజిస్ట్రర్ చేసుకోవాల్సి ఉంటుంది.
Also read: Women employees: దేశంలో అత్యధిక మహిళా ఉద్యోగులున్న కంపెనీగా టీసీఎస్
Also read: Flipkart Realme Festive Sale: రూ.200 కంటే తక్కువ ధరకే అందుబాటులోని స్మార్ట్ ఫోన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook