DA Hike: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 7వ వేతన సంఘం సిఫార్సులను అనుసరించి ఉద్యోగులకు మరో 3 శాతం డీఏ (డియర్నెస్ అలవెన్స్) పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది జనవరి నుంచే పెంచిన డీఏ వర్తించనుంది.
పెరిగిన డిఏ అమలులోకి వస్తే.. బేసిస్ శాలరీలో డీఏ 34 శాతానికి చేరనుంది. దీని వల్ల దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 65 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ (డియర్నెస్ రిలీఫ్)ను.. ఆల్ ఇండియా కన్సూమర్ ప్రైజ్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రీయల్ వర్కర్స్ ప్రకారం లెక్కిస్తారు. దీనిని లేబర్ బ్యూరో ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ విడుదల చేస్తుంది. అంటే ఉద్యోగులకు ద్రవ్యోల్బణం పెరగటం వల్ల కలిగే ఆర్థిక భారం నుంచి ఉపశమనం కల్పించే ఉద్దేశంతో డీఏను పెంచుతూ ఉంటుంది ప్రభుత్వం.
దేశంలో 2021 అక్టోబర్-డిసెంబర్ మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం 5.01 శాతంగా ఉంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అది 6.07 శాతానికి పెరిగింది. దీనితో పెరిగిన ద్రవ్యోల్బణానికి తగ్గట్లుగా డీఏను పెంచుతూ నిర్ణయం తీసకుంది ప్రభుత్వం.
ఇంతకు ముందు 2021 జులై 1న డీఏను 3 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన డీఏ, డీఆర్‌ను విడుదల చేసింది ప్రభుత్వం.
ఇత తాజాగా పెంచిన డీఏ, డీఆర్తో ప్రభుత్వంపై ఏటా రూ.9,544 కోట్ల అదనపు భారం పడనుందని తెలిసింది.
Also read: Petrol price Today: మళ్లీ పెరిగిన ఇంధన ధరలు- హైదరాబాద్‌లో సెంచరీ కొట్టిన డీజిల్..
Also read: Todays Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్, తగ్గుతున్న బంగారం ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook