November 30 Deadline: మరో రెండు రోజుల్లో నవంబర్ ముగిస్తోంది. ఆర్థిక పరంగా పలు ముఖ్యమైన పనులను పూర్తి చేసేందుకు ఈ నెలాఖరు తుది గడువుగా ఉంది. మరి ఆ పనులు ఏమిటి? వాటని ఎలా పుర్తి చేయాలి అనే విషయాలు ఇప్పుడు తెలుకుందాం.
పీఎఫ్ ఖాతాతో ఆధార్ అనుసంధానం..
పీఎఫ్‌తో ఆధార్ అనుసంధానం చేసేందుకు నవంబర్ 30ని తుది గడువుగా నిర్ణయించింది (Aadhaar link to pf number) ఈపీఎఫ్ఓ. నిజానికి ఆగస్టు 31తోనే ఈ గడువు ముగియాల్సి ఉంది. అయితే పీఎఫ్ ఖాతాదారుల విజ్ఞప్తి మేరకు ఈ గడువును రెండు నెలలు పెంచింది. తాజా గడువు కూడా మరో రెండు రోజుల్లో (last date for linking Aadhaar link to pf account ) ముగియనుంది.
పీఎఫ్ ఖాతాకు ఆధార్ అనుసంధానం ఎలా?
పీఎఫ్ ఖాతాతో ఆధార్ అనుసంధానాన్ని ఇంటివద్ద నుంచే పూర్తి చేసుకోవచ్చు.ఆన్లైన్లో పీఎఫ్ పోర్టల్‌లోకి లాగిన్ అయ్యి.. అందులో ఈ-కేవైసీ ఆప్షన్‌ను
ఎంచుకోవాలి. అందులో యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నంబర్), రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాతి విండోలో ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి ఉంటుంది.
మీ ఖాతాలోని వివరాలు, మీ ఆధార్‌లోని వివరాలతో మ్యాచ్ అయితే.. అనుసంధానం పూర్తవుతుంది. ఆధార్-యూఏఎన్ లింక్ అయ్యిందా లేదా అనే విషయాన్ని కూడా అదే పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు.
గడువులోగా ఆధార్-యూఏఎన్ లింక్ చేయకపోతే.. పీఎఫ్ ఖాతాలో ఉద్యోగి సంస్థల వాటా జమకాదు.
పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి..
ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందే వారు.. ప్రతి ఏటా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడం (Pensioners Life Certificate 2021) తప్పనిసరి. ఈ ఏడాది ఇందుకు నవంబర్ 30ని తుది గడువుగా నిర్ణయించింది ప్రభుత్వం.
ఏమిటి ఈ లైప్ సర్టిఫికెట్..
పెన్షన్‌దారుడు జీవించి ఉన్నారని తెలిపేందుకు ఉద్దేశించినదే ఈ లైఫ్ సర్టిఫికెట్. కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు ఉద్యోగ విరమణ అయిన అనంతరం పెన్షన్ పొందేందుకు ఖాతా ఉన్న బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఈ జీవన ప్రమాణ పత్రాన్ని తప్పకుండా సమర్పించాల్సి (Last date ot Submit life Certificate) ఉంటుంది. ఈ సర్టిఫికెట్‌ను సమర్పించకుంటే.. వారికి ప్రభుత్వం పెన్షన్‌ను నిలిపివేస్తుంది.
ఎల్ఐసీ హౌసింగ్ హోం లోన్స్..
రూ.2 కోట్ల వరకు రుణాలు తీసుకునే వారికి సెప్టెంబర్‌లో ఎల్ఐసీ ఓ ప్రత్యేక ఆఫర్‌ను (LIC housing loan offer) తీసుకొచ్చింది. నవంబర్ 30 వరకు ఈ రుణాలపై 6.66 శాతం వడ్డీ రేటుకే రుణాలు (LIC housing loan interest rate) ఇస్తోంది. సిబిల్ స్కోరు 700 అంత కంటే ఎక్కువ ఉన్న ఖాతాదార్లకు వారి వృత్తితో నిమిత్తం లేకుండా రుణాలు జారీ చేస్తున్నట్లు ఎల్ఐశీ హౌసింగ్ ఫినాన్స్ పేర్కొంది. ఈ ఆఫర్ మరో రెండు రోజుల్లో ముగియనుంది. తక్కువ వడ్డీ రుణాలు కావాలనుకునే వారు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు.
Also read: Allahabad HC to Yes Bank: అలహాబాద్ హై కోర్టులో యస్ బ్యాంక్‌కు గట్టి ఎదురుదెబ్బ
Also read: మళ్లీ పెరిగిన బంగారం ధరలు, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook