No Fastags: ఫాస్టాగ్‌కు చెల్లుచీటీ, ఇకపై నో టోల్‌ప్లాజా, త్వరలో కొత్త విధానం

No Fastags: టోల్‌గేట్ ఛార్జీల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త విధానం ప్రవేశపెడుతూ వస్తోంది. ఫాస్టాగ్ విధానం కంటే మెరుగైన, వేగవంతమైన మరో విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 13, 2024, 04:12 PM IST
No Fastags: ఫాస్టాగ్‌కు చెల్లుచీటీ, ఇకపై నో టోల్‌ప్లాజా, త్వరలో కొత్త విధానం

No Fastags: టోల్‌గేట్ల వద్ద వాహనాలు ఎక్కువ సేపు ఆగకుండా, ట్రాఫిక్ నిలవకుండా ఉండేందుకు గతంలో ఫాస్టాగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఈ విధానంలో కూడా కెమేరా స్కానింగ్‌లో సాంకేతిక ఇబ్బందుల కారణంగా ఒక్కోసారి ఆలస్యం జరుగుతోంది. అందుకే ఇప్పుుడు ఫాస్టాగ్ స్థానంలో మరో కొత్త విధానాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రవేశపెడుతోంది. ఈ విధానం అమల్లోకి వస్తే టోల్‌ప్లాజా వద్ద ఆగాల్సిన అవసరం లేదు. 

దేశంలో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో టోల్‌గేట్ల వద్ద ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోంది. టోల్‌గేట్ల వద్ద జరుగుతున్న ఆలస్యం, వివాదాలు వంటివి పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త విధానం అందుబాటులో తీసుకురానుంది. ఈ విధానం అమల్లోకి వస్తే ఏ నేషనల్ హైవే టోల్‌గేట్ వద్ద ఆగాల్సిన అవసరముండదు. మీ వాహనం టోల్‌గేట్ వద్ద ఆగకుండా ముందుకుపోతుంది. త్వరలో దేశంలో శాటిలైట్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ప్రవేశపెట్టనుంది. 

ఫాస్టాగ్ ద్వారా టోల్‌గేట్ల చెల్లింపుల్లో ఎదురౌతున్న సమస్యల్నించి విముక్తి కల్గించేందుకు టోల్‌ప్లాజా ఐటీ సిస్టమ్, హార్డ్‌వేర్‌లో కీలకమైన మార్పులు చేయనున్నారు. ఇప్పటికే ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు ఆహ్వానించింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. టెండర్ దాఖలు చేసే కంపెనీ లేదా సంస్థకు ఏంటెన్నా, ఆర్ఎఫ్ఐడీ రీడర్, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రీడర్, టోల్ లేన్ కంట్రోలర్, టోల్‌ప్లాజా సర్వర్ తో పాటు ఎస్టీక్యూసీ ప్రమాణపత్రం తప్పనిసరిగా ఉండాలి. 

గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారిత ఈ వ్యవస్థతో నేషనల్ హైవేపై ప్రయాణించే వాహనాలు ఆగకుండానే టోల్ దానికదే కట్ అవుతుంది. ఈ కొత్త విధానంలో అమల్లోకి వస్తే ఇక హైవేలపై టోల్‌ప్లాజాలు ఉండవు.

Also read: Oppo F27 Pro: 64MP కెమేరా 8GB Ram మిలట్రీ మన్నికతో Oppo F27 Pro Plus లాంచ్, ధర ఎంతంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News