షేర్ మార్కెట్‌లో చాలా షేర్లు అందుబాటులో ఉన్నాయి. ఎప్పుడు ఏ కంపెనీ షేర్ వృద్ధి చెందుతుందో..ఎప్పుడు ఏది పడిపోతుందో అంచనా వేయలేం. అక్టోబర్ నెలలో అలానే జరిగింది. బ్యాంకింగ్ షేర్లతో భారీగా పెరుగుదల నమోదైంది.
అక్టోబర్ 2022లో మూడు బ్యాంకుల షేర్లు వేగంగా పెరిగాయి. షేర్ ధర పెద్దఎత్తున పెరిగింది. ఇన్వెస్టర్లకు 23 శాతం కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. ఇందులో యాక్సిస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఉన్నాయి.
యాక్సిస్ బ్యాంకు
ప్రైవేటు బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంకు ప్రముఖమైంది. అక్టోబర్ నెలలో యాక్సిస్ బ్యాంకులో 23 శాతం కంటే ఎక్కువ వృద్ధి కన్పించింది. అక్టోబర్ ప్రారంభంలో కంపెనీ షేర్ 720 రూపాయలుంది. ఇప్పుడు ఈ కంపెనీ షేర్ 900 రూపాయలకు చేరుకుంది. అక్టోబర్ 28న ఈ షేర్ ఎన్ఎస్ఈలో 904.50 రూపాయలకు క్లోజ్ అయింది. యాక్సిస్ బ్యాంక్ షేర్ 52 వారాల గరిష్ట ధర 919.95 రూపాయలు కాగా, 52 వారాల కనిష్ట ధర 618.25 రూపాయలుంది.
ఇండియన్ బ్యాంక్
అటు ఇండియన్ బ్యాంక్ షేర్ సైతం అక్టోబర్ నెలలో వేగంగా వృద్ధి చెందింది. అక్టోబర్ నెల ప్రారంభంలో ఈ షేర్ 190 రూపాయలుంది. అక్టోబర్ 28 నాటికి మార్కెట్ క్లోజింగ్‌లో ఎన్ఎస్ఈలో 244.40 రూపాయలైంది. ఇండియన్ బ్యాంక్ షేర్ 52 వారాల గరిష్ట ధర 247.10 రూపాయలు కాగా 52 వారాల కనిష్ట ధర 130.90 రూపాయలుంది. అంటే ఈ బ్యాంకు షేర్ 24 శాతం రిటర్న్స్ ఇచ్చింది.
కెనరా బ్యాంకు
ఇక మూడవ బ్యాంకు కెనరా బ్యాంక్. అక్టోబర్ నెలలో ఈ బ్యాంక్ షేర్ పెరిగింది. కెనరా బ్యాంక్ షేర్ అక్టోబర్ నెలలో 25 శాతం చెందింది. అక్టోబర్ నెల ప్రారంభంలో కెనరా బ్యాంక్ షేర్ 225 రూపాయలుంది. ఇప్పుడు అంటే అక్టోబర్ 28 నాటికి ఎన్ఎస్ఈలో ఈ బ్యాంక్ షేర్ 287.80 రూపాయలకు చేరుకుంది. 52 వారాల గరిష్ట ధర 293.80 రూపాయయలుంది. 52 వారాల కనిష్ట ధర 171.75 రూపాయలుంది.
ఇటీవల కొద్దికాలంగా బ్యాంకింగ్ రంగంలోని షేర్లు పెరుగుతున్నాయి. బ్యాంకింగ్ రంగంలో పెట్టుబడిపై రిటర్న్స్ ఊహించినదానికంటే ఎక్కువే వస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook