Budget 2024: సాధారణ బడ్జెట్ లో సామాన్యులకు, మహిళలకు, వ్యాపారులకు గుడ్ న్యూస్ అందించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన తొలబడ్జెట్లో ఆర్ధిక మంత్రి పలు కీలక ప్రకటనలు చేశారు. సాధారణ బడ్జెట్ 2024-25లో ముద్రాలోన్ లిమిన్ రూ. 20లక్షల వరకు పెంచారు. ఈ స్కీం కింద ఇప్పటి వరకు వ్యాపారం చేసేందుకు రూ. 10లక్షల లోన్ లభిస్తుంది. ఇప్పుడు ముద్రాలోన్ కింద వ్యాపారులు రూ. 10లక్షల నుంచి రూ. 20లక్షల వరకు లోన్ పొందవచ్చు. ప్రధానమంత్రి ముద్రాయోజన 2015లో ప్రారంభించిన సంగతి తెలిసిందే.
కాగా ముద్రా యోజన కింద లభించే లోన్ లిమిట్ ను రెండింతలు అంటే రూ. 20లక్షల వరకు పెంచనున్నట్లు సీతారామన్ తెలిపారు. మహిళా ఉద్యోగులను ప్రోత్సహించడానికి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో భాగంగా మహిళా సహకార సంఘాలు,స్టార్టప్ లను ప్రోత్సహించే పథకాలను ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. ఈ పథకాలతో మహిళలకు ఉపాధి అవకాశాలు, ఆర్థిక సహాయం అందుతాయి. దేశంలోని మహిళల సంక్షేమ, అభివృద్ధి కోసం 2024 బడ్జెట్లో మొత్తం 3లక్షల కోట్లో రూపాయలను కేటాయించారు. ఈ నిధులు మహిళా సంక్షేమ పథకాల అమలుకు, వారి పురోగతికి ఉపయోగపడతాయి. అంతేకాదు వర్క్ ఫోర్స్ లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు వర్కింగ్ ఉమెన్స్ కోసం కేంద్రం హాస్టళ్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రానున్న ఐదేండ్లలో కోటి మంది యువతకు టాప్ 500 కంపెనీల్లో ఇంటర్న్ షిప్ అవకాశాలు కల్పించే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
Also Read : Union Budget: బడ్జెట్లో యువతకు గుడ్‌న్యూస్? కేంద్ర బడ్జెట్‌తో స్మార్ట్ ఫోన్ ధరలు భారీగా తగ్గుదల?
ఇక ఉపాధి, నైపుణ్యం, ఎంఎస్ఎంఈలతోపాటు మధ్య తరగతి వంటి నాలుగు ప్రధాన రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. దేశంలోని 4.1 కోట్ల మంది యువతకు ప్రయోజనం చేకూరేవిధంగా ఈ నాలుగు రంగాలపై ఫోకస్ పెడుతున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో రూ. 2లక్షల కోట్ల నిధులను ఈ రంగాలకు కేటాయించనున్నట్లు మంత్రి వివరించారు.ఉచిత సౌర విద్యుత్ పథకంపై, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, 'ప్రధాన మంత్రి సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం ప్రారంభించింది. ఈ పథకం కింద పైకప్పులపై సోలార్ ప్యానెల్లు అమర్చుతారు. దీంతో 1 కోటి కుటుంబాలు 300 యూనిట్ల వరకు పొందుతాయి. ప్రతి నెల ఉచిత విద్యుత్ ను ఈ పథకం మరింత ప్రమోట్ చేస్తుందని తెలిపారు.
Also Read :Budget 2024: బడ్జెట్ వేళ.. తెల్ల చీరలో మెరిసిన కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలమ్మ..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter