BSNL Recharge: ప్రస్తుతం మార్కెట్లో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ - ఐడియా టెలికాం సంస్థలు ముందున్నాయి. అయితే వీటికి పోటీగా కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కూడా అనేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పాటు ఇతర ప్రైవేట్ నెట్ వర్క్స్ ధరలను పెంచడం వల్ల కస్టమర్లు కూడా BSNL నెట్ వర్క్ బాట పట్టారు. ఈ క్రమంలో వారి కోసం అతి తక్కువ ధరలకే రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో భాగంగా ఇప్పుడు కేవలం రూ. 797 రీఛార్జ్ ప్లాన్ తో ఇప్పుడు 395 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు.
BSNL రూ. 797 రీఛార్జ్ ప్లాన్ వివరాలు
BSNL నెట్ వర్క్ కు చెందిన రూ. 797 రీఛార్జ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. లాంఛింగ్ ఆఫర్ లో భాగంగా కస్టమర్లకు అదనంగా 30 రోజుల వ్యాలిడిటీ ఆఫర్ గా ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 395 రోజులుగా ఉంది.
అయితే 2022 జూన్ 12 లోగా ఈ రీఛార్జ్ ప్లాన్ చేసుకునే వాళ్లకు మాత్రమే ఈ ఆఫర్ చెల్లుబాటు కానుంది. ఈ ప్లాన్ లోని మొదటి 60 రోజులు అన్ని సదుపాయాలు ఉచితంగా లభిస్తాయి. కానీ, 60 రోజుల తర్వాత కాలింగ్, ఇంటర్నెట్ కు డేటా ప్లాన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
BSNL రూ. 797 రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు
ఈ రూ. 797 రీఛార్జ్ ప్లాన్ లో మొదటి 60 రోజుల పాటు రోజుకు 2 GB డేటా.. అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు అందిస్తుంది. 60వ రోజు తర్వాత ఇంటర్నెట్ డేటా వేగం 80 Kbpsకి తగ్గుతుంది. ముందుగా చెప్పినట్లుగా ఈ ప్లాన్ కింద అందించే డేటా, కాలింగ్ ప్రయోజనాలు 60 రోజుల తర్వాత ముగుస్తాయి. కానీ, రోజుకు 100 SMSలు మాత్రం కస్టమర్లు వినియోగించుకోవచ్చు.
Also Read: Xiaomi 11i 5G Flipkart: రూ.30 వేల విలువైన Xiaomi 5G మొబైల్ ను రూ.10 వేలకే కొనండి!
Also Read: Yono Shopping Offers: SBI కస్టమర్లకు గుడ్ న్యూస్.. షాపింగ్ పై 70 శాతం డిస్కౌంట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook