BSNL 4G Launch in India: BSNL 4G సేవలకు గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే కస్టమర్లకు అందుబాటులో!

BSNL 4G Launch in India: BSNL యూజర్లకు గుడ్ న్యూస్! ఈ నెట్ వర్క్ లో త్వరలోనే 4G సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 2022 ఆగస్టు నుంచి కేరళ రాష్ట్రంలో ట్రయల్ ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2022, 05:59 PM IST
BSNL 4G Launch in India: BSNL 4G సేవలకు గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే కస్టమర్లకు అందుబాటులో!

BSNL 4G Launch in India: ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL త్వరలో దేశంలో 4G స్పీడ్‌లో ఇంటర్నెట్ సేవలను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఏడాది ఆగస్టు నుంచి 4G ట్రయల్స్ ప్రారంభిస్తోందని సమాచారం. అయితే BSNL 4G సేవలు అందుబాటులోకి వచ్చే నగరాలను కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.

జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. BSNL ఈ ఏడాది ఆగస్టులో 4G ట్రయల్‌ను ప్రారంభించనుంది. BSNL మొదట కేరళలోని ఓ నాలుగు జిల్లాల్లో ట్రయల్ రన్ నడవనుందని తెలుస్తోంది. అది విజయవంతమైన తర్వాత దీని రాష్ట్రవ్యాప్తంగా BSNL 4G సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. 

కేరళలోని ఎర్నాకుళం, తిరువనంతపురం, కన్నూర్, కోజికోడ్ జిల్లాలో ముందుగా BSNL 4G సేవలను ప్రారంభించనున్నారని.. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఆ రాష్ట్ర వ్యాప్తంగా 4G సేవలను విస్తరించనున్నారు. అందుకోసం కేరళ రాష్ట్రవ్యాప్తంగా 800 టెలికాం టవర్లను ఏర్పాటు చేసేందుకు ఆమోదం లభించింది. 

ఇదే విషయాన్ని BSNL కేరళ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ తెలిపారు. ఈ టవర్ల నిర్మాణంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సహాయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. కేరళలో BSNL 4G సేవలు విజయవంతమైన తర్వాత వచ్చే ఏడాది అంటే 2023 నాటికి దేశవ్యాప్తంగా ఈ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.  

Also Read: BSNL Recharge: BSNL బంపర్ ఆఫర్.. రూ.797 రీఛార్జ్ ప్లాన్ తో 395 రోజుల వ్యాలిడిటీ!

Also Read: Xiaomi 11i 5G Flipkart: రూ.30 వేల విలువైన Xiaomi 5G మొబైల్ ను రూ.10 వేలకే కొనండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News