SBI Bank Alert : ఎస్‌బీఐ కస్టమర్లకు అలెర్ట్.. మీకు పొరపాటు ఈ మెసేజ్ వస్తే జాగ్రత్త..

SBI Bank Alert: ఎస్‌బీఐ తన బ్యాంకు ఖాతాదారులకు ఓ హెచ్చరిక చేస్తోంది. మోసపూరిత సందేశాలకు రిప్లై ఇవ్వకూడదని సూచిస్తోంది. దీనివల్ల ఎంతోమంతి ఖాతాదారులు తమ డబ్బును పోగొట్టుకున్నారు. వెంటనే ఈ పనిచేయకపోతే ఖాతాదారులు తమ డబ్బును కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది.

Written by - Renuka Godugu | Last Updated : Feb 11, 2024, 02:59 PM IST
SBI Bank Alert : ఎస్‌బీఐ కస్టమర్లకు అలెర్ట్.. మీకు పొరపాటు ఈ మెసేజ్ వస్తే జాగ్రత్త..

SBI Bank Alert: ఎస్‌బీఐ తన బ్యాంకు ఖాతాదారులకు ఓ హెచ్చరిక చేస్తోంది. మోసపూరిత సందేశాలకు రిప్లై ఇవ్వకూడదని సూచిస్తోంది. దీనివల్ల ఎంతోమంతి ఖాతాదారులు తమ డబ్బును పోగొట్టుకున్నారు. వెంటనే ఈ పనిచేయకపోతే ఖాతాదారులు తమ డబ్బును కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది.దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ 50 కోట్లకుపైగా ఉన్న తమ ఖాతాదారులకు ఈ సూచన చేసింది. తమ ఖాతాలకు సంబంధించిన వివరాలను బ్యాంక్ ఎప్పుడూ మెసేజ్ రూపేణ అడగదని చెప్పింది. అవి మోసపూరిత సందేశాలు మాత్రమే అలాంటి మెసేజ్ లు వచ్చిన వెంటనే జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 

ఏం చేయకూడదు?
మోసపూరిత సందేశాలు ఎస్‌బీఐ బ్యాంక్ పేరు మీద వస్తున్నాయి. మీ ఖాతాలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను, ఓటీపీ వివరాలను షేర్ చేయకూడదని ఎస్‌బీఐ తమ ఖాతాదారులను హెచ్చరించింది. ఇలా చేయకపోతే ఖాతాదారులు ఇబ్బందులు పడాల్సివస్తుంది. చివరగా డబ్బు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.

ఇదీ చదవండి: మీ పిల్లల పేరుపై ఇప్పుడే పీఎఫ్ ఖాతా ఓపెన్ చేయండి.. 18 ఏళ్లకు రూ.32 లక్షలు పక్కా..
మెసేజ్ ఎలా ఉంటుంది?
ఎస్‌బీఐ బ్యాంక్ పేరుపై వచ్చే ఈ మెసేజ్‌లో 'ప్రియమైన ఖాతాదారులు మీ పాన్ కార్డును వెంటనే అప్డేట్ చేయకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుంది. కింద ఉన్న లింక్ ను వెంటనే క్లిక్ చేయండి' అనే మెయిల్స్ రావచ్చు. ఇలాంటి మోసపూరిత సందేశాలకు ఎట్టిపరిస్థితుల్లో జవాబు ఇవ్వకండి. దీనివల్ల చాలామంది తమ ఖాతాల్లోనుంచి లక్షల్లో డబ్బులను కోల్పోవాల్సి వచ్చింది అని ఎస్‌బీఐ తమ ఖాతాదారులకు తెలియజేసింది.

మెసేజ్ వస్తే ఏం చేయాలి?
ఇలాంటి సందేశాలు మీకు కూడా వస్తే Report.phishing@sbi.co.in వెంటనే తెలియజేయండి. అలాగే 1930 సైబర్ క్రైం నంబర్ కు వెంటనే కాల్ చేసి కంప్లైంట్ చేయాలి. లేకపోతే సైబర్ క్రైం బ్రాంచ్ అధికారిక వెబ్‌సైట్ https://cybercrime.gov.in/ లో కూడా కంప్లైంట్ చేయవచ్చు.

మీరూ ఇలా మోసపూరిత కాల్స్, మెసేజ్ ల వల్ల డబ్బు పోగొట్టుకుంటే వెంటనే కంప్లైంట్ చేయాలి. అప్పుడే మీ పూర్తి డబ్బు మీకు తిరిగి పొందుతారు. ఆర్‌బీఐ గైడ్ లైన్స్ ప్రకారం మోసం జరిగిన వెంటనే మొదటగా సంబంధిత బ్యాంక్ కు ఈ విషయాన్ని తెలియజేయాలి. ఎందుకంటే బ్యాంకులు ఇలాంటి సైబర్ ఫ్రాడ్స్ కు ఇన్సూరెన్స్ పాలిసీని తీసుకుంటాయి. మీరు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి మీ వివరాలను పంపుతుంది.

ఇదీ చదవండి: PF ఖాతాదారులకు గుడ్ న్యూస్‌.. పెరిగిన వడ్డీరేటు ఎంత? ఎప్పుడు జమా చేస్తారంటే?

అప్పుడు మీరు మీ పూర్తి డబ్బును నిర్ధిష్ట గడువులో తిరిగి పొందుతారు. కానీ, ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ కంప్లైంట్ మీరు డబ్బు కోల్పోయిన మూడురోజుల్లో చేయాలి. మీరు ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. ఒకవేళ 4-7 రోజుల తర్వాత కంప్లైంట్ చేస్తే మీ డబ్బు నుంచి దాదాపు రూ.25 వేలు పాలసీ కవరేజీ నుంచి నష్టపోవాల్సి వస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News