Maruti Suzuki Celerio Vxi CNG 2024 Price and Features: ఈ మధ్య మనదేశంలో సీఎన్‌జీ కార్ల వాడకం బాగా పెరిగింది. ఎందుకంటే పెట్రోల్ మరియు డీజిల్ కార్లతో పోలిస్తే సీఎన్జీ కార్లు ఎక్కువ మైలేజ్ ను ఇస్తున్నాయి, అంతేకాదు ధర కూడా తక్కువ. ఈ టైప్ కార్లలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ మరియు ఆల్టో కె10 మంచి బ్రాండ్ క్రియేట్ చేశాయి. అయితే వీటి కంటే కూడా ఎక్కువ మైలేజ్ ను ఇచ్చే కారు కూడా ఉంది. అది మారుతి సుజుకి సెలెరియో సీఎన్‌జీ. ఇది దేశంలోనే అత్యధిక మైలేజీని ఇస్తున్న కారుగా గుర్తింపు పొందింది.
మైలేజ్, ధర
సెలెరియో కారు కిలో సీఎన్‌జీకి(ధర సుమారు రూ. 80/కిలో) 35.60 కిమీల మైలేజీని ఇస్తుంది. అదే వ్యాగన్ఆర్ సీఎన్‌జీ మైలేజ్ 32.52కిమీ, ఆల్టో కె10 సీఎన్‌జీ మైలేజ్ 33.85కిమీ, ఎస్-ప్రెస్సో సీఎన్‌జీ మైలేజ్ 31.2కిమీ వరకు ఇస్తున్నాయి. మారుతి సుజుకీ సెలెరియో ధర రూ. 5.37 లక్షల నుండి రూ. 7.09 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. అయితే దీని సీఎన్‌జీ వేరియంట్ ధర రూ.6.74 లక్షలుగా ఉంది.
ఫీచర్స్
సెలెరియో నాలుగు మోడల్స్ లో వస్తుంది. అవే LXI, VXI, ZXI మరియు ZXI+. వీటిలో VXI మోడల్ లో మాత్రమే సీఎన్‌జీ అందుబాటులో ఉంది. ఈ కారు 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కారులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. దీనితో పాటు పాసివ్ కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ వీల్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు టర్న్ ఇండికేటర్‌లతో కూడిన ఎలక్ట్రిక్ ORVMలు కూడా ఉన్నాయి.
Also Read: Honda Discount Offers: హోండా కార్లపై భారీ డిస్కౌంట్, ఏకంగా 1.20 లక్షల తగ్గింపు
Also Read:LIC Superhit Scheme: ఒక్కసారే పెట్టుబడి, జీవితకాలం నెలకు 12 వేల పెన్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook