Business ideas: కేవలం 10 వేలతో ప్రారంభం, ప్రతి నెలా లక్షలాది రూపాయల సంపాదన

Business ideas: తెలివితేటలు, సృజనాత్మకత ఉంటే వ్యాపారంలో చాలా వృద్ధి చెందవచ్చు. తక్కువ ఖర్చులో ఎక్కువ సంపాదించే కొన్ని అద్భుతమైన బిజినెస్ ఐడియాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 6, 2022, 10:25 PM IST
Business ideas: కేవలం 10 వేలతో ప్రారంభం, ప్రతి నెలా లక్షలాది రూపాయల సంపాదన

Business ideas: చాలామందికి ఉద్యోగం కంటే వ్యాపారంపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. మీక్కూడా వ్యాపారం చేయాలనే ఆలోచన ఉంటే ఆత్మ నిర్భర్ భారత్ మిషన్ ద్వారా మీ కలను సాకారం చేసుకోవచ్చు. ఈ పథకం కింద వ్యాపారం ప్రారంభించేవారికి రుణాలు లభిస్తాయి. ఇవాళ మేం చెప్పే బిజినెస్ ఐడియా మీ ఇంట్లోంచే ప్రారంభించుకోవచ్చు. ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువగా ఉంటుంది. 

మీరు మంచి స్కాలర్ అయుండి వ్యాపారం సొంతంగా చేయాలనే ఆలోచన ఉంటే ఆన్‌లైన్ కోర్స్ ప్రారంభించవచ్చు. బ్యాంకు, ఎస్ఎస్‌సి నుంచి మొదలుకుని సివిల్ సర్వీస్ పరీక్షకు కూడా ఆన్‌లైన్ ద్వారా శిక్షణ అందిస్తున్నారు ఇప్పుడు. పిల్లల చదువుకు కూడా ఆన్‌లైన్ టీచర్ల డిమాండ్ ఉంది. కేవలం ఆన్‌లైన్ కోర్సుల ద్వారా కోట్లాది రూపాయలు టర్నోవర్ చేస్తున్న వేదికలు చాలానే ఉన్నాయి. ఇందులో పెట్టుబడి తక్కువ. ఆదాయం ఎక్కువగా ఉంటుంది. 

ఇంట్లో కూర్చునే వ్యాపారం చేయాలనుకుంటే బ్రెడ్ తయారీ కూడా మంచి ఆలోచన. బ్రెడ్స్ తయారుచేసి బేకరీ లేదా మార్కెట్‌లో సరఫరా చేయవచ్చు. ఇందులో పెట్టుబడి పెద్దగా అవసరం లేదు. లాక్‌డౌన్ తరువాత బ్రెడ్ వ్యాపారం పెరిగింది. కేవలం 10 వేల రూపాయల పెట్టుబడితో ప్రారంభించవచ్చు. కావల్సిందల్లా గోధుమ పిండి లేదా మైదా, ఉప్పు, పంచదార, నీళ్లు, బేకింగ్ పౌడర్ లేదా ఈస్ట్, డ్రైఫుడ్స్, మిల్క్ పౌడర్ అవసరమౌతాయి.

యూట్యూబ్ ఛానెల్ ద్వారా చాలామంది కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఒకవేళ మీరు కెమేరా ఫ్రెండ్లీ అయుండి..కంటెంట్ ఉంటే వెంటనే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించవచ్చు. దీనికోసం తెలివితేటలు, రచనా శైలి ఉంటే చాలు. దేశంలో ఇంట్లో కూర్చుని లక్షలు సంపాదిస్తున్న యూట్యూబర్లు చాలామందున్నారు. 

బ్లాగింగ్ ద్వారా కూడా డబ్బులు బాగా సంపాదించవచ్చు. మీలో రచనా శక్తి ఉంటే ఇంట్లో కూర్చుని సంపాదించవచ్చు. పెద్దస్థాయిలో బ్లాగింగ్ చేయాలనుకుంటే సొంతంగా వెబ్‌సైట్ ఏర్పాటు చేసుకోవచ్చు. వెబ్‌సైట్ ప్రమోషన్ కోసం చాలా వేదికలున్నాయి. 

ఇక అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ డెవలపర్ ఆన్‌లైన్ ద్వారా చేయవచ్చు. దీనికోసం కొద్దిగా శిక్షణ అవసరమౌతుంది. ఓ వెబ్‌సైట్ ఏర్పాటు చేసుకుని పని ప్రారంభించవచ్చు. డిజిటల్ ప్రమోషన్ అనేది ప్రస్తుతం మంచి వ్యాపారంగా ఉంది.

Also read: ATM With Draw Rules: ఏటీఎం నుంచి 4 సార్లు డబ్బులు తీస్తే..173 రూపాయలు కట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News