Toyoto Innova Craze: మార్కెట్‌లో ఆ కారు క్రేజ్ ఎలాగుందంటే వెయిటింగ్ పీరియడ్ 2 సంవత్సరాలు

Toyoto Innova Craze: దేశంలో ప్రస్తుతం ఎస్‌యూవీ కార్ల క్రేజ్ నడుస్తోంది. లేదా 7 సీటర్ కార్లంటే ఆసక్తి చూపిస్తున్నారు. హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఆదరణ తగ్గుతోంది. అదే సమయంలో మిడ్ సైజ్ ఎస్‌యూవీలు ఆకట్టుకుంటున్నాయి. దేశంలో ఆ 7 సీటర్ కారుకు ఉన్న వెయిటింగ్ పీరియడ్ చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 20, 2023, 09:46 PM IST
Toyoto Innova Craze: మార్కెట్‌లో ఆ కారు క్రేజ్ ఎలాగుందంటే వెయిటింగ్ పీరియడ్ 2 సంవత్సరాలు

Toyoto Innova Craze: దేశంలో మారుతి సుజుకి, టాటా మోటార్స్, కియా మోటార్స్, హ్యుండయ్, టొయోటా ఇలా దాదాపు అన్ని కంపెనీలు 7 సీటర్ లేదా ఎస్‌యూవీ కార్లను మార్కెట్ డిమాండ్ ప్రకారం విడుదల చేస్తున్నాయి. 7 సీటర్ కార్లలో అన్నింటికంటే టాప్‌గా చెప్పుకునేది ఇన్నోవా. ఇప్పుడు ఇన్నోవా కొత్త వెర్షన్ కారంటే మార్కెట్‌లో పిచ్చి బాగా పెరిగిపోయింది.

దేశంలోని 7 సీటర్ కార్లలో అత్యధిక క్రేజ్ ఉన్నది టొయోటా ఇన్నోవాకే. టొయోటా ఇటీవలే 7 సీటర్ కొత్త వెర్షన్ లాంచ్ చేసింది. ఈ కారు పేరు టొయోటా ఇన్నోవా హైక్రాస్. ఈ కారంటే ప్రజలకు ఎంత క్రేజ్ ఉందో మాటల్లో చెప్పలేం. ఈ కారు వెయిటింగ్ పీరియడ్ 2025 వరకూ అంటే ఇవాళ బుక్ చేస్తే రెండేళ్లు ఆగాలి. అంటే ఎంత డిమాండ్, ఎంత క్రేజ్ ఉందో అర్దం చేసుకోవచ్చు. డిమాండ్ మరీ పెరగడంతో బుకింగ్స్ కొద్దికాలం ఆపాల్సిన పరిస్థితి ఏర్పడింది. టొయోటా ఇన్నోవా హైక్రాస్ 2022 డిసెంబర్ నెలలో లాంచ్ అయింది. లాంచింగ్ నుంచే ఈ కారుకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ అంటే జనానికి క్రేజ్ ఎక్కువైందని చెప్పాలి. అంచనాలకు మించి అమ్మకాలు కొనసాగుతున్నాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా అంటే బుకింగ్స్‌కు అనుగుణంగా కంపెనీ కార్లను సరఫరా చేయలేకపోతోంది. 

టొయోటా ఇన్నోవా హైక్రాస్‌లో స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ వెయిటింగ్ పీరియడ్ 21-23 నెలలుంది. అంటే ఇవాళ బుక్ చేసుకుంటే దాదాపు రెండేళ్లు ఆగాల్సిందే. అంటే ఇవాళ మీరు ఈ కారు బుక్ చేసుకుంటే 2025లోనే మీ చేతికి అందుతుంది. ఈ కారు టాప్ వేరియంట్ జెడ్ ఎక్స్, జెడ్ ఎక్స్ ఓల బుకింగ్ ఇప్పటికే నిలిపివేసింది. ఇందులోనే ప్రీమియం ఎంపీవీ పెట్రోల్ వేరియంట్ 6-7 నెలల్లో అందుతోంది.

టొయోటా ఇన్నోవా హైక్రాస్ ధర 18.55 లక్షల రూపాయల్నించి 29.99 లక్షల వరకూ ఉంది. ఇందులో ఆరు వేరియంట్లు G, GX, VX, VX(O), ZX, ZX(O)ఉన్నాయి. ఇన్నోవా హైక్రాస్ 7, 8 సీటర్ కాన్ఫిగరేషన్‌లో లభ్యమౌతుంది. మూడవ వరుసను ఫోల్ట్ చేస్తే ఇన్నోవా హైక్రాస్‌లో 991 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. ఇది 185 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. ఇందులో 2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కారు లీటరుకు 16.13 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే 2 లీటర్ పెట్రోల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ అయితే లీటరుకు 23.24 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

Also read: Bank Holidays in july 2023: జూలైలో 15 రోజులు బ్యాంకు సెలవులు, ఎప్పుడెప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News