Bank Holidays November 2022: గురు నానక్ జయంతి, కార్తిక పౌర్ణమి.. ఇవాళ బ్యాంకులకు సెలవు దినమా ?

Bank Holidays November 2022: ఇవాళ గురునానక్ జయంతి.. కార్తిక పౌర్ణమి పర్వదినం కూడా కావడంతో పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు దినం పాటిస్తున్నాయి. అయితే, బ్యాంకుల్లో లావాదేవీలు జరిపే అవసరం ఉన్న వారు ఇవాళ బ్యాంకులు తెరిచే ఉంటాయా లేక గురునానక్ జయంతి, కార్తిక పౌర్ణమి కారణంగా సెలవు దినం పాటిస్తాయా అనే సందిగ్ధంలో ఉన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 8, 2022, 12:10 PM IST
  • నేడు గురునానక్ జయంతి, కార్తిక పౌర్ణమి
  • ఇవాళ బ్యాంకులు పనిచేయనున్నాయా ?
  • ఆర్బీఐ ఏం చెబుతోంది ?
Bank Holidays November 2022: గురు నానక్ జయంతి, కార్తిక పౌర్ణమి.. ఇవాళ బ్యాంకులకు సెలవు దినమా ?

Bank Holidays Today: బ్యాంకు పని మీద బ్యాంకు వరకు వెళ్లాకా బ్యాంకుకు సెలవు ఉన్నట్టయితే తమ పరిస్థితి ఏంటనేది వారి సందిగ్ధానికి కారణం. ఇదే విషయమై ఒక క్లారిటీ కోసం చాలామంది గూగుల్ కూడా చేస్తుంటారు. అలాంటి వారి కోసమే నేడు బ్యాంకులకు సెలవా లేక పని దినమా అని చెప్పే ఈ వివరణాత్మక కథనం. బ్యాంకులకు సెలవు దినాలు అనేవి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ఉండే భిన్నమైన సంస్కృతులు, ఆయా సంస్కృతుల ఆధారంగా జరిపే పండగల తేదీల ఆధారంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు దినాలు ఆధారపడి ఉంటాయి. 

ఉదాహరణకు ఓనం పండగ కేరళ రాష్ట్రంలోనే ఎక్కువ ఘనంగా జరుపుకుంటుంటారు. తమిళనాడు, కర్ణాటకపై ఓనం ప్రభావం కొంత కనిపించినప్పటికీ.. ఉత్తరాదిన ఓనం పండగను జరుపుకోరు. అలాంటప్పుడు కేరళలో సేవలు అందించే అన్ని బ్యాంకులు కూడా ఓనం పండగ నాడు ఆ రాష్ట్రంలో సెలవు దినంగా ప్రకటించినప్పటికీ.. అవే బ్యాంకులు మిగతా రాష్ట్రాల్లో ఆ రోజున పనిచేస్తూనే ఉంటాయి. అలాగే గురునానక్ జయంతి, కార్తిక పౌర్ణమి అయిన నేడు కూడా చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు మూసే ఉండనున్నాయి. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన హాలీడేస్ క్యాలెండర్ ప్రకారం నవంబర్ 8న.. అంటే ఇవాళ ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీఘడ్, డెహ్రాడూన్, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై నాగపూర్, న్యూ ఢిల్లీ, రాయ్‌పూర్, రాంచి, షిమ్లా, శ్రీనగర్ వంటి నగరాల్లో బ్యాంకులు మూసే ఉండనున్నాయి. 

మరోవైపు అగర్తలా, అహ్మెదాబాద్, బెంగళూరు, చెన్నై, గ్యాంగ్‌టక్, గౌహతి, ఇంఫాల్, కొచ్చి, పనాజి, పాట్నా, షిల్లాంగ్, తిరువనంతపురం వంటి నగరాల్లో గురునానక్ జయంతి నాడు సైతం బ్యాంకులు పనిచేయనున్నాయి.

Trending News