AC offers: అమెజాన్ సమ్మర్ స్పెషల్​ ఆఫర్స్​- ఏసీలపై సూపర్ కూల్ డిస్కౌంట్స్​..

AC offers: అమెజాన్​లో ఏసీలపై అదిరే ఆఫర్లు అందుబాటులు ఉన్నాయి. పరిమితకాల ఆఫర్​గా అమెజాన్ ఈ డిస్కౌంట్లు అందిస్తోంది. మరి స్పెషల్​ సేల్​లో ఏసీలపై ఆఫర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 19, 2022, 06:39 PM IST
  • ఏసీలపై అమెజాన్ అదిరే డిస్కౌంట్లు
  • స్పెషల్​ ఆఫర్లతో పాటు బ్యాంక్​ డిస్కౌంట్లు కూడా..
  • ఎక్స్ఛేంజ్ ఆఫర్​తో మరింత తగ్గనున్న ధరలు
AC offers: అమెజాన్ సమ్మర్ స్పెషల్​ ఆఫర్స్​- ఏసీలపై సూపర్ కూల్ డిస్కౌంట్స్​..

AC offers: ఎండాకాలం ప్రారంభంలోనే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మార్చి నెల కూడా ముగియకముందే ఊష్టోగ్రతలు రికార్డు స్థాయిలో మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీనితో చాలా మంది ఏసీలు కొనేందుకు సిద్ధమవుతున్నారు. కానీ బయట రేట్లు కూడా ఎండాల్లానే మండిపోతున్నాయి.

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్​లో వినియగదారులకు బంపర్ ఆఫర్స్ ప్రకటించింది. ఏసీలపై అదిరే డిస్కౌంట్లు ఇస్తోంది. మరి మీరుకూడా ఏసీ కొనేందుకు ప్లాన్​ చేస్తుంటే.. బెస్ట్​ ఆఫర్స్​ గురించి ఇక్కడ తెలుసుకోండి.

ఏసీలపై అదిరే ఆఫర్లు ఇలా..

ఎల్​జీ 1.5 టన్​ 5 స్టార్ ఐఐ డ్యూయల్ ఇన్వర్టర్​ స్ప్లిట్​ ఏసీపై 21 శాతం తగ్గింపు ఇస్తోంది అమెజాన్​. దీనితో రూ.56,490 విలువైన ఈ ఏసీ ధర రూ.44,490కి తగ్గింది. దీనితో పాటు కూపన్​ ద్వారా మరో రూ.1000 వరకు డిస్కౌంట్​ పొందే వీలుంది.

పానసోనిక్​ 1.5 టన్​ 5 స్టార్​ ఏసీ.. 

ఈ ఏసీ ధర రూ.59,400. కాగా స్పెషల్ ఆఫర్​ కింద 28 శాతం తగ్గింపుతో రూ.42,990కే అందిస్తోంది అమెజాన్​. కూపన్స్ ద్వారూ రూ.1,500 వరకు తగ్గింపు పొందే వీలుంది. అలెక్సా ఎనెబుల్​ ఫీచర్ ఇందులో ఉంది.

లాయిడ్​ 1.5 టన్​ 3 స్టార్ ఏసీ..

ఈ ఏసీపై దాదాపు 50 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది అమెజాన్​. దీని ధర రూ.65,999గా ఉండగా ప్రస్తుతం రూ.32,999కే అందుబాటులో ఉంది.

వైఫై ఎనేబుల్​, ఆటోమేటిక్ హ్యుటిడిటీ కంట్రోల్​ వంటి అధనాతన ఫీచర్లు ఉన్నాయి. మరోవైపు ఏసీ కంప్రెషర్​పై 10 ఏళ్లపాటు వారంటీ ఉంది.

వోల్టాస్​ 1.4 టన్స్ 5 స్టార్ ఫిక్స్​డ్​ స్పీడ్ విండో ఏసీ..

ఏసీల్లో టాటా వోల్టాస్​కు ఉన్న ప్రత్యేకతే వేరు. ఈ ఏసీలు అందుబాటు ధరలో లభిస్తాయి.. కాగా తాజా ఆఫర్​లో ధరలు మరింత తగ్గాయి. ఈ ఏసీపై 18 శాతం డిస్కౌంట్ ఇస్తోంది అమెజాన్​. అంటే రూ.33,990 విలువైన ఈ ఏసీ రూ.27,990కే కొనుగోలు చేసే వీలుంది.

టీసీఎల్​ 1.5 టన్​ ఏసీ..

ఈ ఏసీపై 37 శాతం డిస్కౌంట్ ఇస్తోంది అమెజాన్​. దీనితో రూ.50,990 విలువైన ఈ ఏసీని కేవలం రూ.31,999కే కొనుగోలు చేయొచ్చు. ఇది వైఫై ఐఐ అల్ట్రా ఇన్వర్టర్​ స్ప్లిట్​ ఏసీ. కాపర్​, విటమిన్​ సి అండ్ సిల్వర్ అయాన్​ ఫిల్టర్​తో అందుబాటులో ఉంది.

మరిన్ని..

ఈ ఏసీలన్నింటిపై అమెజాన్ ప్రత్యేక సేల్ ధరల తగ్గింపుతో పాటు, బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మరోవైపు ఎక్ఛేంజ్ ఆఫర్​ కూడా ఇస్తోంది అమెజాన్​. ఈ ఆఫర్లన్ని కలిపితే మరో రూ.5 వేల వరకు డిస్కౌంట్ లభించొచ్చని తెలుస్తోంది.

నోట్​: ఈ ఆఫర్లన్నీ అమెజాన్ వెబ్​సైట్​ ప్రకారం చెప్పడం జరిగింది. ఎవరైనా ఈ ఆఫర్లను చూసి ఏసీ కొనుగోలు చేయాలనుకుంటే.. డిస్కౌంట్లను మరోసారి తనిఖీ చేయడం మంచిది.

Also read: Amazon Mobile Savings Days: అమెజాన్ మొబైల్ సేవింగ్స్..ఇవాళే చివరిరోజు, ఆ ఫోన్ కేవలం 549 రూపాయలు మాత్రమే

Also read: Gmail Offline: ఇకపై ఇంటర్నెట్ లేకుండానే మెయిల్స్ సెండ్ చేయవచ్చు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News