Amazon Prime Day Sale Offer: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ 'ప్రైమ్ డే' సేల్ ప్రకటించింది. జూలై 23, 24 తేదీల్లో అమెజాన్ సైట్‌లో ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఈ ఆఫర్ ద్వారా చిన్నపిల్లల ప్యాంపర్స్ మొదలు ఫర్నీచర్, కిచెన్ వస్తువులు, బ్రాండ్ స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్స్, వాషింగ్ మెషీన్లు తదితర వస్తువులపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఆఫర్ కేవలం అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఇంతకీ ఈ ప్రైమ్ డే సేల్‌లో ఏయే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రైమ్ డే సేల్ ఆఫర్ రెండు రోజులే :
జూలై 23న ప్రారంభమయ్యే అమెజాన్ ప్రైమ్ డే సేల్.. జూలై 24వ తేదీ రాత్రి 11.59 గంటలకు ముగుస్తుంది. అతి చౌక ధరలో బెస్ట్ బ్రాండ్స్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ ఆఫర్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.
అందుబాటులో ఉండే ఆఫర్లు :
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా పలు బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్ ఫోన్లపై 40 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉండనుంది. రెడ్‌మీ, శాంసంగ్, రియల్‌మీ, ఐఫోన్, ఒప్పో, వన్ ప్లస్ తదితర స్మార్ట్ ఫోన్లపై ఈ తగ్గింపు పొందవచ్చు. పలు స్మార్ట్ ఫోన్లపై నో కాస్ట్ ఈఎంఐతో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్స్, హెడ్ ఫోన్స్, స్మార్ట్ వాచీలపై ఏకంగా 75 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉండనుంది.
గృహోపకరణాలపై 70 శాతం, స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్స్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు తదితర వస్తువులపై 50 శాతం, దుస్తులు, బ్యూటీ-మేకప్, ఫుట్‌వేర్, జ్యువెలరీ, లగేజ్ బ్యాగ్స్‌పై 80 శాతం వరకు, నిత్యావసర వస్తువులపై 60 శాతం వరకు,బుక్స్, టాయ్స్, గేమింగ్స్‌పై 40 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉండనుంది.
వన్ ప్లస్, ఐఫోన్, తదితర ఫోన్లపై భారీ తగ్గింపు :
ప్రైమ్ డే సేల్‌లో వన్ ప్లస్ 9 సిరీస్ 5జీ స్మార్ట్ ఫోన్లపై అమెజాన్ రూ.15 వేలు వరకు తగ్గింపు అందిస్తోంది. తద్వారా రూ.37,999 ప్రారంభ ధరకే వన్ ప్లస్ 9సిరీస్ 5జీ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి. వన్ ప్లస్ 10 ప్రో 5జీపై రూ.7 వేలు వరకు తగ్గింపు ఉంది. ఇక ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌పై రూ.20 వేలు వరకు తగ్గింపు లభించనుంది.
అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే..:
అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే 'ప్రైమ్ డే' ఆఫర్ వర్తిస్తుంది. కొత్తగా ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకునేవారికి కూడా ఆఫర్ వర్తిస్తుంది. రూ.1499 ప్యాక్‌తో ఏడాది పాటు రూ.179 ప్యాక్‌తో నెల పాటు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.
Also Read: Godavari Floods LIVE:భద్రాచలం సేఫేనా?మరో నాలుగు గంటలు గడిస్తేనే.. రేపు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook