ఈ కామర్స్ వ్యాపారంలో ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉన్న అమెజాన్..ఇండియాలో కూడా సింహభాగాన్ని సాధించింది. ఇప్పుడు ప్రత్యేకమైన ఎయిర్ కార్గో సేవలు ప్రారంభించడం ద్వారా ఆ రంగంలో దేశంలోనే తొలి కంపెనీగా నిలిచింది.
అమెజాన్ ఎయిర్ దీనికోసం బోయింగ్ 737 -800 విమానాన్ని క్విక్‌జెట్ కార్గో ఎయిర్‌లైన్స్‌తో నిర్వహించేలా సిద్ధం చేసింది. ఐర్లాండ్‌కు చెందిన ఏఎస్ఎల్ ఏవియేషన్ గ్రూప్, ఏఎఫ్ఎల్ జాయింట్ వెంచర్ ఇది. కస్టమర్ షిప్‌మెంట్‌లను ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ద్వారా అమెజాన్ హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాలకు చేరవేస్తుంది. అమెజాన్ ఎయిర్ అనేది 2016లో అమెరికాలో లాంచ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా 70 ప్రాంతాలకు 110 ఎయిర్‌క్రాఫ్ట్‌ల ద్వారా ఎయిర్ కార్గో నెట్‌వర్క్ నిర్వహిస్తోంది.
అమెజాన్ ఎయిర్‌ను ఇండియా లాంచ్ చేయడంపై చాలా గొప్పగా భావిస్తున్నామని..దీనిద్వారా కసమ్టర్లకు మరింత తక్కువ ధరలో, అత్యంత వేగంగా సరుకులు రవాణా చేయగలమని అమెజాన్ గ్లోబల్ ఎయిర్ వైస్ ప్రెసిడెంట్ సారా రోడ్స్ తెలిపారు. క్విక్‌జెట్ కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌ను హైదరాబాద్‌లో తెలంగాణ మంత్రి కేటీఆర్ ద్వారా లాంచ్ చేసింది అమెజాన్.
మల్టీ మోడల్ కనెక్టివిటీ అభివృద్ధికి అనువైన వాతావరణం తెలంగాణలో ఉందని..హైదరాబాద్ ఈ కామర్స్‌కు అతిపెద్ద హబ్‌గా అవతరించినందున అమెజాన్ ఎయిర్ లాంచ్ కీలకం కానుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.రాష్ట్రంలోని ఎయిర్ కార్గో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మరింత పటిష్టం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని..ఈ క్రమంలో అమెజాన్ ఎయిర్ లాంచ్‌ను స్వాగతిస్తున్నామన్నారు. హైదరాబాద్‌ను దేశానికి కార్గో హబ్‌గా మార్చేందుకు అవసరమైన అన్ని అవకాశాల్ని కల్పిస్తున్నామన్నారు.
Also read: IT Raids: బీబీసీ కార్యాలయాలపై మూడవరోజు కొనసాగుతున్న ఐటీ దాడులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook