Exchange RBI Banned 2000 Rupees Notes in Amazon Pay: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే 2000 రూపాయల నోటును ఉపసంహరించుకుంది. ప్రజల వద్ద ఉన్న 2000 రూపాయల నోటు మార్చుకునేందుకు సెప్టెంబర్ వరకూ గడువిచ్చింది. అయితే ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఉండేలా అమెజాన్ కొత్త సేవలు ప్రారంభించింది.
2000 రూపాయల నోటును మార్చుకునేందుకు ఇకపై బ్యాంకులకు వెళ్లి పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చునే 2 వేల రూపాయల నోట్లను మార్చుకునే అవకాశం కల్పిస్తోంది అమెజాన్. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ ఇటీవలే అమెజాన్ పే క్యాష్ లోడ్ సిస్టమ్ అందుబాటులో తీసుకొచ్చింది. ఇందులో నెలకు 50 వేల రూపాయలు ఇంటి వద్దే అమెజాన్ యాప్ ద్వారా మార్చుకోవచ్చు. ఇదెలా పనిచేస్తుందంటే..
అమెజాన్‌లో మీరు నోట్లు మార్చుకుంటే దానికి బదులుగా మీకు ఇవ్వాల్సిన డబ్బు అమెజాన్ పే వ్యాలెట్‌కు చేరుతుంది. దీన్నించి మీరు షాపింగ్ చేసుకోవడం లేదా బ్యాంక్ ఎక్కౌంట్‌కు బదిలీ చేసుకోవడం చేయవచ్చు. దీనికోసం ఏం చేయాలంటే..
ఆర్బీఐ ఇటీవల రద్దు చేసిన 2000 నోట్లను మార్చుకునేందుకు క్యాష్ లోడ్ అర్హత ఉండే వస్తువుల్ని అమెజాన్ నుంచి ఆర్డర్ చేయాలి. చెక్ అవుట్ వరకూ వచ్చిన తరువాత క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకోవాలి. ఆ తరువాత మీరు ఆర్డర్ చేసిన వస్తువు ఇచ్చేందుకు డెలివరీ ఏజెంట్ వచ్చినప్పుడు అమెజాన్ పే బ్యాలెన్స్ డిపాజిట్ చేయాలనే విషయం చెప్పాలి. మీరు అనుకున్న నగదును డెలీవరీ ఏజెంట్‌కు ఇస్తే..అతను అమెజాన్ పే వ్యాలెట్ ఖాతాకు మీ డబ్బును అక్కడికక్కడే బదిలీ చేస్తాడు.
ఇదేదో బాగానే ఉంది. ఎందుకంటే 2000 నోట్లను మార్చుకునేందుకు ఇకపై బ్యాంకులకు వెళ్లి పడిగాపులు కాయకుండా ఎంచక్కా ఇంట్లో కూర్చుని అమెజాన్ ద్వారా నోట్లను మార్చేసుకోవచ్చు. నెలలో 50 వేలు కాకుండా పరిమితి ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
Also Read: Hyundai Creta: టాటా నెక్సాన్, మారుతి బ్రెజాను దాటేసిన హ్యుండయ్ క్రెటా, ధర ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి