Amazon Deal: వాషింగ్ మెషీన్, డిష్‌వాషర్, మైక్రోవేవ్ ఓవెన్‌ల పై భారీ డిస్కౌంట్‌..కొనాలనుకుంటే ఇదే సరైన డీల్.!!

Amazon Deal: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ (Amazon) మాన్‌సూన్ అప్లియన్స్ సేల్‌(Monsoon appliances sale) కింద ఓ ప్రత్యేకమైన సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్‌ లభించనుంది. ముఖ్యంగా ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, డిష్‌వాషర్, మైక్రోవేవ్‌లపై భారీ తగ్గింపులతో అందిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 5, 2022, 03:14 PM IST
  • వాషింగ్ మెషీన్, డిష్‌వాషర్, మైక్రోవేవ్ కొనుగోలు చేయాలనుకుంటే
  • మాన్‌సూన్ అప్లియన్స్ సరైన డీల్
  • Bosch వాషింగ్ మెషీన్‌ పై భారీ డిస్కౌంట్‌
Amazon Deal: వాషింగ్ మెషీన్, డిష్‌వాషర్, మైక్రోవేవ్ ఓవెన్‌ల పై భారీ డిస్కౌంట్‌..కొనాలనుకుంటే ఇదే సరైన డీల్.!!

Amazon Deal: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ (Amazon) మాన్‌సూన్ అప్లియన్స్ సేల్‌(Monsoon appliances sale) కింద ఓ ప్రత్యేకమైన సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్‌ లభించనుంది. ముఖ్యంగా ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, డిష్‌వాషర్, మైక్రోవేవ్‌లపై భారీ తగ్గింపులతో అందిస్తోంది. ఈ ఉత్పత్తులను అమెజాన్‌లోని మాన్‌సూన్ అప్లియన్స్ సేల్‌(Monsoon appliances sale) ద్వారా కొనుగోలు చేస్తే నేరుగా 30% తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా EMI ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ. 1,500 క్యాష్‌బ్యాక్ కూడా లభించనుంది.

Bosch వాషింగ్ మెషీన్‌ పై భారీ డిస్కౌంట్‌:

మాన్‌సూన్ అప్లియన్స్ సేల్‌లో Bosch వాషింగ్ మెషీన్‌పై భారీ మొత్తంలో డిస్కౌంట్‌ లభించనుంది. ఈ వాషింగ్ మెషీన్‌ అసలైన ధర రూ. 39,799 ఉండగా..ఈ ప్రత్యేమైన సేల్‌ ద్వారా 20% డిస్కౌంట్‌ పొందవచ్చు. అన్ని ఆఫర్స్‌, డిస్కౌంట్స్‌ పోను ఈ  Bosch వాషింగ్ మెషీన్‌ రూ. 31,990కి అందుబాటులో ఉంది. దీని స్పెసిఫికేషన్స్ చూసినట్లైయితే..ఇది  7 లీటర్ల సామర్థ్యంతో  5 స్టార్ రేటింగ్ కలిగి ఉంటుంది. ఇందులో ఉండే హైజెనిక్ వాష్ ఫీచర్‌ వల్ల దుస్తువులలో దాగి ఉండే బ్యాక్టీరియాను చంపుతుంది.

LG టాప్ లోడ్ వాషింగ్ మెషీన్:

LGలోని టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ 26% వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంది.  రూ. 24,990 విలువైన ఈ వాషింగ్ మెషీన్ రూ. 18,490తో ఈ సేల్‌లో అందుబాటులో ఉంది. LG  వాషింగ్ మెషీన్ స్పెసిఫికేషన్స్ చూసినట్లైయితే..ఈ వాషింగ్ మెషీన్ పూర్తిగా ఆటోమేటిక్ సిస్టమ్‌పై పని చేయనుంది. ఇది  7 కిలోల సామర్థ్యం, 5 స్టార్‌ రేటింగ్‌ కలిగి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో లభించననుంది.

LG 14 Place డిష్‌వాషర్:

ప్రస్తుతం అమెజాన్‌ అన్ని డిష్‌వాషర్లపై భారీ డిస్కౌంట్‌ను ఇస్తుంది. ఈ అమెజాన్‌ మాన్‌సూన్ అప్లియన్స్ సేల్‌లో LG 14 Place డిష్‌వాషర్ పై 31% తగ్గించి  రూ. 44,990కి విక్రయిస్తోంది. ఈ డిష్‌వాషర్ ధర రూ. 64,990 కాగా ఈ స్పెషల్‌ ఆఫర్‌ వల్ల భారీగా డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఈ వాషర్‌కు Smart ThinQ యాప్‌క్‌ కనెక్ట్ చేసి సులభంగా వినియోగించుకోవచ్చు. దీని మోటార్‌పై రెండు సంవత్సరాల వారంటీ, ప్రోడక్ట్‌పై 10 సంవత్సరాల వారంటీని LG ప్రకటించింది.

IFB 20 L మైక్రోవేవ్:

ప్రముఖ కంపెని IFB 20 లీటర్లు సామర్థ్యం గల మైక్రోవేవ్‌పై మాన్‌సూన్ అప్లియన్స్ సేల్‌(Monsoon appliances sale) ద్వారా 23 శాతం తగ్గింపు లభించనుంది. దీని అసలు ప్రైస్‌ రూ. 13,490  కాగా ఈ సేల్ ద్వారా రూ. 10,390కి లభిస్తుంది.  ఇది 20 లీటర్లు సామర్థ్యంతో బేకింగ్, గ్రిల్లింగ్, రీహీటింగ్, డీఫ్రాస్టింగ్, చైల్డ్ లాక్ వంటి బేకింగ్‌ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Also Read: Home Loan EMI Offers: హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేటు ఏ బ్యాంకులో ఎంత ఉంది, కావల్సిన అర్హతలేంటి

Also Read: Delhi Weather: దేశ రాజధానిలో భానుడి ప్రతాపం..ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News