Akash Ambani And Shloka Blessed With A Baby Boy: అంబానీ కుటుంబంలోకి వారసుడు వచ్చేశాడు.. తాత అయిన ముఖేష్ అంబానీ

Akash Ambani And Shloka Blessed With A Baby Boy : ప్రపంచ అపర కుబేరులలో ఒకరైన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట సంబరాలు మొదలయ్యాయి. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ తండ్రయ్యాడు. ఆకాశ్ భార్య శ్లోకా ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

Last Updated : Dec 10, 2020, 07:18 PM IST
  • పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శ్లోకా
  • తల్లితండ్రులైన శ్లోకా, ఆకాశ్ అంబానీ
  • తాత అయిన ముఖేష్ అంబానీ హర్షం
Akash Ambani And Shloka Blessed With A Baby Boy: అంబానీ కుటుంబంలోకి వారసుడు వచ్చేశాడు.. తాత అయిన ముఖేష్ అంబానీ

Mukesh Ambani become Grandfather: ప్రపంచ అపర కుబేరులలో ఒకరైన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట సంబరాలు మొదలయ్యాయి. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ తండ్రయ్యాడు. ఆకాశ్ భార్య శ్లోకా ఓ పండంటి మగబిడ్డ (Akash Ambani And Shloka Blessed With A Baby Boy)కు జన్మనిచ్చింది. దీంతో ముఖేష్ అంబానీ, నీతా అంబానీలు తాతయ్య, నానమ్మలు మారినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. దీనిపై అంబానీ కుటుంబం స్పందించింది. ‘శ్రీకృష్ణభగవానుడి దయ, ఆశీర్వాదాలతో నేడు శ్లోకా, ఆకాశ్ అంబానీ (Akash Ambani) దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. నీతా అంబానీ, ముఖేష్ అంబానీ (Mukesh Ambani)లు తొలిసారిగా నానమ్మ, తాతయ్యగా మారారు. కోకిలాబెన్ మునిమనవడికి స్వాగతం పలికారని’ అని అంబానీ కుటుంబానికి చెందిన అధికార ప్రతినిధి తెలిపారు. 

Also Read: EPFO: మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలియదా.. అయితే UAN యాక్టివేట్ చేసుకోండి

కాగా, ముఖేష్ అంబానీ, నీతా దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె కాగా, 2019లో రసెల్ మెహతా కుమార్తె శ్లోకా, ఆకాశ్ అంబానీ వివాహం ఘనంగా నిర్వహించారు. కుమార్తె ఈషా అంబానీ వివాహం సైతం వేడకగా జరిపించారు. తాజాగా శ్లోకా, ఆకాశ్ అంబానీ దంపతులు తల్లిదండ్రులు అయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Jio 5G Service in India: జియో 5జీపై ముఖేష్ అంబానీ కీలక ప్రకటన 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News