Airtel Free OTT Plans: ప్రముఖ టెలీకం కంపెనీ ఎయిర్‌టెల్ యూజర్లకు శుభవార్త అందిస్తోంది. ఇకపై 20కు పైగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా అందించనుంది. ఇటీవల టారిఫ్ ధరల్ని పెంచిన ఎయిర్‌టెల్ ఇప్పుడు ఓటీటీ ఆఫర్లతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.
Airtel Free OTT Plans: ప్రముఖ టెలీకం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు రీఛార్జ్ ప్లాన్స్ ధరల్ని భారీగా పెంచేశాయి. ఇప్పుడు తిరిగి యూజర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ ఒక ప్లాన్‌తో ఏకంగా 20 ఓటీటీలు ఉచితంగా ఆఫర్ చేస్తోంది.
ఎయిర్‌టెల్‌లో ఓటీటీ ఉచితంగా ఆఫర్ చేస్తున్న ప్లాన్స్ చాలానే ఉన్నాయి. ఉచితంగా ఓటీటీలతో పాటు అదనపు డేటా కూడా అందిస్తోంది. ఉచితంగా ఓటీటీలు లభించే ప్లాన్స్‌లో అత్యంత చౌక దరకు లభించేది 149 రూపాయల ప్లాన్ అని చెప్పవచ్చు. అయితే ఇది కేవలం డేటా ప్లాన్ మాత్రమే. ప్రస్తుతం ఉన్న యాక్టివ్ ప్లాన్‌తో పనిచేస్తుంది. అంటే ఈ ప్లాన్‌లో ఎలాంటి కాల పరిమితి ఉండదు. కాలింగ్ సౌకర్యం ఉండదు. ఎస్ఎంఎస్ సౌకర్యముండదు. కేవలం డేటా మాత్రమే వస్తుంది. రన్నింగ్ ప్లాన్ కాల పరిమితి ఉన్నంతవరకూ ఈ డేటా ప్లాన్ వర్తిస్తుంది. ఈ ప్లాన్ తీసుకుంటే కలిగే లాభాలేంటో తెలుసుకుందాం
ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తున్న 149 రూపాయల రీఛార్జ్ ప్లాన్‌లో 1జీబీ అదనపు డేటా లభిస్తుంది. ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్న ప్లాన్ ఉన్నంతవరకూ ఇది పనిచేస్తుంది. అంటే మీ రన్నింగ్ ప్లాన్ 30 రోజులుంటే ఇందులో కూడా అదనపు డేటా 30 రోజులు వస్తుంది.
ఈ డేటా ప్లాన్ తీసుకుంటే 30 రోజుల వరకూ ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే యాక్సెస్ ఉంటుంది. ఈ ఆప్షన్ ద్వారా 20కు పైగా ఓటీటీలు వీక్షించే అవకాశముంటుంది. ఈ 20 ఓటీటీల్లో సోనీలివ్, లయన్స్ గేట్ ప్లే, ఫ్యాన్ కోడ్, ఎరోస్ నౌ, హోయ్‌చోయ్, మనోరమా మ్యాక్స్ వంటివి ఉన్నాయి. అంతేకాదు..కేవలం మొబైల్‌లోనే కాకుండా స్మార్ట్ టీవీలో కూడా వీక్షించవచ్చు. ఒకవేళ ఇంకా ఎక్కువ డేటా కావాలంటే 181 రూపాయల రీఛార్జ్ ప్లాన్ ఉంది. ఈ ప్లాన్‌తో 15 జీబీ డేటాతో పాటు ఇవే ప్రయోజనాలు లభిస్తాయి.
Also read: 8th Pay Commisson: ఉద్యోగుల పంట పండినట్టే, 8 వేతన సంఘం, కోవిడ్ బకాయిలపై బడ్జెట్‌లో ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook