AC Price Down: వేసవి ప్రారంభానికి ముందు శుభవార్త.. సగానికి తగ్గిన ఏసీ ధరలు!

AC Price Reduced 2023, Check AC Prices and Offers. ఎయిర్ కండీషనర్‌లపై ప్రస్తుతం భారీ తగ్గింపు ఉంది. ఏకంగా 50 శాతం ధరకు కస్టమర్‌లు కొనుగోలు చేయవచ్చు.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 4, 2023, 01:32 PM IST
  • వేసవి ప్రారంభానికి ముందు శుభవార్త
  • సగానికి తగ్గిన ఏసీ ధరలు
  • రూ. 31990కి కొనుగోలు చేయవచ్చు
AC Price Down: వేసవి ప్రారంభానికి ముందు శుభవార్త.. సగానికి తగ్గిన ఏసీ ధరలు!

50 Percent Offers on ACs: భారతదేశంలో శీతాకాలం మరోకొన్ని వారాలలో ముగిసిపోనుంది. ఇప్పుడే ఎండలు మండిపోతున్నాయంటే.. వేసవి వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఈసారి చలి ఏవిధంగా ఉందో.. ఉష్ణోగ్రతలు కూడా అదే మాదిరి ఉండనున్నాయి. అందుకే జనాలు ఇప్పటినుంచే ఏసీ, కూలర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే స్టాక్ రన్నవుట్ అవుతున్నప్పుడు ఏసీల ధరలు తగ్గవు. ఇపుడు కంపెనీలు స్టాక్ క్లియరెన్స్ అమ్మకాలను నడుపుతున్నందున సగం ధరకే లభిస్తుంది. ఈ రోజు అలాంటి ఏసీల గురించి చూద్దాం. 

ఎయిర్ కండీషనర్‌లపై ప్రస్తుతం భారీ తగ్గింపు ఉంది. ఏకంగా 50 శాతం ధరకు కస్టమర్‌లు కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ 1.5 టన్ సామర్థ్యం గల ఎయిర్ కండీషనర్‌పై కూడా ఉంది. ఈ ఎయిర్ కండీషనర్‌ అతి పెద్ద గదిని కూడా కొన్ని నిమిషాల్లో చల్లబరుస్తుంది. ఈ ఎయిర్ కండీషనర్ శక్తివంతమైనది మాత్రమే కాదు.. హైటెక్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ఎయిర్ కండీషనర్‌ చాలా ప్రత్యేకమైనదని అని చెప్పొచ్చు.

కస్టమర్‌లు ఈ ఎయిర్ కండీషనర్‌ను కేవలం రూ.  31990కి కొనుగోలు చేయవచ్చు. అయితే దీని అసలు ధర రూ. 64600. ఈ ఎయిర్ కండీషనర్‌పై 50% తగ్గింపు ఉంది. దాంతో కస్టమర్‌లు ఈ ఎయిర్ కండీషనర్‌ను చాలా తక్కువ ధరకు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఈ ఎయిర్ కండీషనర్‌ 2022 మోడల్. మీరు 3 స్టార్ BEE రేటింగ్‌తో ఆటో రీస్టార్ట్ స్లీప్ మోడ్‌తో సహా చాలా వరకు అప్‌డేట్ చేయబడిన ఫీచర్‌లు ఉన్నాయి. 

Also Read: Hero Bike-Scooters Sales 2023: హీరో ముందు అన్ని 'జీరో'లే.. 3.5 లక్షల బైక్-స్కూటర్లు అమ్ముడయ్యాయి!

Also Read: Xiaomi Electric Car 2023: షియోమీ తొలి ఎలక్ట్రిక్ కార్ వచ్చేసింది.. సూపర్ లుకింగ్! కానీ భారీ జరిమానా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News