7th Pay Commission: గుడ్‌న్యూస్, త్వరలో ఫిట్‌మెంట్ పెంపు, 52 లక్షల ఉద్యోగులకు ప్రయోజనం

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ఫిట్‌మెంట్ అంశంపై శుభవార్త అందనుంది. అందుకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ శాలరీలో పెరుగుదల కన్పించనుంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 21, 2022, 05:55 PM IST
7th Pay Commission: గుడ్‌న్యూస్, త్వరలో ఫిట్‌మెంట్ పెంపు, 52 లక్షల ఉద్యోగులకు ప్రయోజనం

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ఫిట్‌మెంట్ అంశంపై శుభవార్త అందనుంది. అందుకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ శాలరీలో పెరుగుదల కన్పించనుంది. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది శుభవార్త. త్వరలో ఫిట్‌మెంట్ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఫలితంగా కనీస వేతనం పెరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే డ్రాఫ్ట్ సిద్ధమైంది. జీ బిజినెస్ అందిస్తున్న వివరాల ప్రకారం..డ్రాఫ్ట్ సమర్పించిన తరువాత జూలై నెలాఖరు వరకూ ఈ అంశంపై భేటీ జరగనుంది. ఈ విషయాన్ని ఉద్యోగుల సంఘం తెలిపింది. ఒకవేళ ఈ అంశంపై అంగీకారం లభించితే..52 లక్షలకంటే ఎక్కువ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ శాలరీలో ఫిట్‌మెంట్ కింద పెరుగుదల కన్పిస్తుంది. 

భారీగా పెరగనున్న ఉద్యోగుల వేతనం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 1, 2022 నుంచి కొత్త డీఏ అమలు కానుంది. వాస్తవానికి ఏఐసీపీఐ గణాంకాల ప్రకారం జూలై 1 నుంచి కరవు భత్యంలో 4 నుంచి 5 శాతం పెంపు అంటే 38 నుంచి 39 శాతం కానుంది. ఏప్రిల్ వరకూ ఏఐసీపీఐ ఇండెక్స్ నెంబర్లు విడుదలయ్యాయి. కనీ మే, జూన్ నెంబర్ల తరువాత ఈ విషయం ప్రకటించనున్నారు. ఈలోగా ఒకవేళ ఫిట్‌మెంట్ అంశంపై ప్రభుత్వం అంగీకరిస్తే కేంద్ర ప్రభుత్వ, పెన్షనర్ల వేతనం, పెన్షన్ పెరగనుంది. 

కనీస వేతనంలో పెంపు

7వ వేతన సంఘంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాన్ని ఫిట్‌మెంట్ అంశం ఆధారంగా నిర్ణయించారు. ఒకవేళ ఫిట్‌మెంట్ పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం పెరుగుతుంది. ఇదే ఫార్ములాతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనం రెండున్నర రెట్ల కంటే ఎక్కువ పెరిగింది. ప్రస్తుతం ఉద్యోగుల ఫిట్‌మెంట్ 2.57 రెట్లుగా ఉంది. దీని ఆధారంగా మినిమమ్ బేసిక్ శాలరీ 18 వేల రూపాయలుగా ఉంది. అత్యధికంగా 56 వేల 9 వందల రూపాయలుంది. 

శాలరీ ఎంత పెరుగుతుంది

6వ వేతన సంఘం ప్రకారం పీబీ1 గ్రేడ్ ఉద్యోగుల వేతనం 18 వందల రూపాయలు కాగా ప్రస్తుత ఎంట్రీ పే 7 వేల రూపాయలుంది. 7వ వేతన సంఘం ప్రకారం ఫిట్‌మెంట్ పెరిగిన తరువాత ఎంట్రీ పే 7 వేలకు 2.57 రెట్లు ఎక్కువ అంటే 18 వేల రూపాయలు. ఇక 6వ వేతన సంఘం ప్రకారం 18 వందల రూపాయలు కాగా ఎంట్రీ పే 7 వేల రూపాయలుంది. ఇక ఫిట్‌మెంట్ వచ్చిన తరువాత 7వ వేతన సంఘం ప్రకారం 7వేలకు 3 రెట్లు అంటే 21 వేలవుతుంది. 

Also read: Flipkart Smart TV Offers: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్స్.. రూ.25 వేలు విలువ చేసే స్మార్ట్ టీవీ కేవలం రూ.7499కే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News