కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 16 నెలల్నించి ఆగిపోయిన 18 నెలల డీఏ బకాయి విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త అందింది. డీఏ బకాయిల విషయమై ఉద్యోగ సంఘాలు చాలాసార్లు కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. గత ఏడాదిన్నర కాలంలో మూడుసార్లు డీఏ పెంచే విషయమైన నిర్ణయం జరిగినా..బకాయి డీఏలపై ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు.
2023 నుంచి డీఏ బకాయి చెల్లింపు
నిలిచిపోయిన డీఏ బకాయిలు ఈసారి వస్తాయనే నమ్మకం వచ్చింది ఉద్యోగులకు. కేబినెట్ సెక్రటరీతో జరిగే చర్చల్లో ఈ విషయం ప్రస్తావనకు రానుంది. జీ బిజినెస్ అందించిన వివరాల ప్రకారం ప్రభుత్వం 18 నెలల ఎరియర్లను 3 వాయిదాల్లో చెల్లించనుంది. 2023 నుంచి డీఏ బకాయిలు చెల్లింపు ప్రారంభం కావచ్చు.
డీఏ బకాయిల చెల్లింపుపై భేటీ
కరవు భత్యం బకాయిల చెల్లింపుపై ఓ సమావేశం జరగాల్సి ఉంది. ఈ సందర్భంగా 2020 నుంచి నిలిచిపోయిన డీఏ బకాయిలు చెల్లించడంపై ఆమోదం లభించవచ్చు. ప్రభుత్వం 2021లో డీఏను ఒకేసారి 11 శాతం పెంచింది. కానీ అంతకుముందు కరోనా కారణంగా 2020 జనవరి, జూలై 2020, 2021 జనవరిలకు సంబంధించి మూడు వాయిదా లభించలేదు. ఉద్యోగులు కోరినా ప్రభుత్వం ఇచ్చేందుకు నిరాకరించింది.
మూడు వాయిదాల్లో చెల్లించే అవకాశం
ఉద్యోగులు, పెన్షనర్ల సంఘాల ప్రతినిధి కేబినెట్ సెక్రటరీతో జరిగే సమావేశంలో ఈ అంశాల్ని ప్రస్తావించనున్నారు. ప్రభుత్వ ఒకవేళ 18 నెలల పెండింగ్ డీఏ ఇచ్చేందుకు సిద్ధమైతే..ఆ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు వాయిదాల్లో ఇచ్చే అవకాశుముంటుంది. వాస్తవానికి ఆ సమయంలో కరవుభత్యం ఫ్రీజ్ అయుండటం వల్ల ఆ సమయంలో డబ్బులు ఇవ్వరని కేంద్ర ఆర్ధికశాఖ ఇప్పటికే తెలిపింది.
ఈ విషయంపై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని సుప్రీంకోర్టు కోరింది. ఇది ఉద్యోగుల హక్కు అని సుప్రీంకోర్టు వెల్లడించింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జేసీఎం శివ గోపాల్ మిశ్రా చెప్పినట్టు..వివిధ రకాల పే స్కేల్స్ ఆధారంగా ఉద్యోగులకు చెల్లింపు ఉంటుంది. లెవెల్ 3 ఉద్యోగుల డీఏ ఎరియర్లు 11,880 రూపాయల్నించి 37,554 రూపాయలుండవచ్చు.
Also read: Gold Price Hike: పెళ్లిళ్ల సీజన్ మొదలు.. ఏకంగా రూ. 1,760 పెరిగిన బంగారం ధర!
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook