7వ వేతన సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం నుంచి దీపావళి కానుక లభించింది. ఐదేళ్ల డీఏతో ఎరియర్స్‌తో పాటు..భారీగా పెరుగుతున్న జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి ముందే వచ్చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది గుడ్‌న్యూస్. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావలి కానుక ప్రకటించింది. వేరియబుల్ డీఏను పెంచిన తరువాతక 4 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సిబ్బంది, అధికారుల జీతాన్ని 12 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన జీతం 2017 ఆగస్టుతో లభించనుంది. అంటే ఏకంగా ఐదేళ్ల ఎరియర్ల రూపంలో భారీ మొత్తం చేతికి అందుతుంది. కేంద్ర ఆర్ధిక శాఖ దీనికోసం ఓ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.
కేంద్ర ఆర్ధిక శాఖ జారీ చేసిన వివరాల ప్రకారం ప్రభుత్వ రంగంలోని 4 భీమా కంపెనీల సిబ్బంది జీతాన్ని 12 శాతం చొప్పున పెంచింది. ఈ పెంపు కూడా ఆగస్టు 2017 నుంచి వర్తించనుంది. ఈ పథకాన్ని సాధారణ భీమా రివిజన్ ప్లాన్ 2022 గా పరిగణిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆర్ధికశాఖపై ఏకంగా 8 వేల కోట్ల భారం పడనుంది.
కొత్తగా పెంచిన జీతం 2017 ఆగస్టు నుంచి వర్తించనుంది. అంటే దాదాపు ఐదేళ్లకు సంబంధించిన ఎరియర్లు ఒకేసారి భారీ మొత్తంలో చేతికి అందనున్నాయి. ఈ ఎరియర్ అనేది సిబ్బంది పనితీరును బట్టి లెక్కించి ఇస్తారు. ప్రభుత్వ రంగంలో నాలుగు భీమా కంపెనీలున్నాయి. ఇందులో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఉన్నాయి.
Also read: Atal Pension Yojana Scheme: నెలకు జస్ట్ రూ. 210 పెట్టుబడితో 5 వేలు పెన్షన్ వచ్చే మార్గం ఇదిగో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
7th Pay Commission: భారీగా పెరిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం, ఐదేళ్ల ఎరియర్లు