Fact Check: కేంద్రం 4 శాతం డీఏ పెంపు ప్రకటించిందా.. ఆ సర్క్యులర్‌లో నిజమెంత...

7th Pay Commission DA Hike Updates: కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపు ప్రకటించిందా.. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేరిట వైరల్ అవుతున్న సర్క్యులర్‌లో నిజమెంత...

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 26, 2022, 10:24 AM IST
  • కేంద్రం డీఏ పెంపు ప్రకటించిందా
  • 4 శాతం డీఏ పెంపు ప్రకటనలో నిజమెంత
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సర్క్యులర్
Fact Check: కేంద్రం 4 శాతం డీఏ పెంపు ప్రకటించిందా.. ఆ సర్క్యులర్‌లో నిజమెంత...

7th Pay Commission DA Hike Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం రెండో డీఏ పెంపు ప్రకటించినట్లుగా ఒక సర్క్యులర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న 34 శాతం డీఏని 38 శాతానికి పెంచినట్లు ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. జూలై 1, 2022 నుంచి డీఏ పెంపు వర్తిస్తుందని.. డీఏ ఏరియర్స్ సెప్టెంబర్ నెల వేతనంతో ఉద్యోగులకు చెల్లించడం జరుగుతుందని అందులో ప్రకటించారు. అయితే ఇది పూర్తిగా అవాస్తమని గుర్తించాలి. డీఏ పెంపు, డీఏ ఏరియర్స్‌పై కేంద్రం నుంచి ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. ఈ మేరకు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) నుంచి ఒక ప్రకటన విడుదలైంది.

కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపు ప్రకటించినట్లుగా వైరల్ అవుతున్న సర్క్యులర్ ఫేక్ అని పీఐబీ స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి అటువంటి సర్క్యులర్ ఏదీ జారీ కాలేదని తెలిపింది. ఈ ఫేక్ సర్క్యులర్ కారణంగా చాలామంది ఉద్యోగులు గందరగోళానికి గురయ్యారు. కొన్ని మీడియా సంస్థలు కూడా దీన్ని అధికారిక ప్రకటనగా భావించి వార్తలు ప్రచురించినట్లు తెలుస్తోంది. పీఐబీ ఇచ్చిన స్పష్టతతో ఇది ఫేక్ అని తేలిపోయింది.

అసలేంటీ 'డీఏ' :

డీఏ అంటే డియర్‌నెస్ అలవెన్స్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ వేతనంలో కొంత శాతాన్ని డీఏగా ఇస్తారు. ప్రతీ నెలా వేతనంతో పాటే ఉద్యోగులకు డీఏ అందుతుంది. ప్రతీ ఏటా రెండుసార్లు డీఏ పెంపు ఉంటుంది. ఈ ఏడాది మార్చిలో కేంద్రం మొదటి డీఏ పెంపు ప్రకటించింది. ఈ ఏడాది జనవరి నుంచే పెరిగిన డీఏ అమలులోకి వస్తుందని తెలిపింది. పెంచిన డీఏతో కలిపి ప్రస్తుతం 34 శాతం డీఏ ఉద్యోగులకు అందుతోంది. ఇక రెండో డీఏ కోసం ప్రస్తుతం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. 

జూలై, ఆగస్టు నెలల్లో దీనిపై ప్రకటన ఉంటుందని భావించినప్పటికీ అలాంటిదేమీ జరగలేదు. 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు వచ్చే సెప్టెంబర్‌లో కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏఐసీపీఐ (ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైజ్ ఇండెక్స్) ప్రకారం డీఏ పెంపు 4 శాతం వరకు ఉండొచ్చుననే అంచనాలు నెలకొన్నాయి. జూన్ మాసానికి ఏఐసీపీఐ ఇండెక్స్ 129.2 పాయింట్లుగా ఉంది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం 4 శాతం మేర డీఏ పెంపు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. 

Also Read: Trisha Clarity on Politics: రాజకీయాల్లోకి త్రిష.. క్లారిటీ ఇచ్చేసిందిగా!

Also Read: రైల్వే ఉద్యోగం కోసం షాకింగ్ స్కెచ్.. ఏకంగా బొటనవేలి చర్మం కత్తిరించి.. పరీక్షా కేంద్రంలో అడ్డంగా దొరికిపోయిన యువకుడు..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News