How to Change 2000 Rupees Note: ప్రస్తుతం రూ.2 వేల నోటు రద్దుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రూ.2000 నోటును ఉపసంహరించుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించినప్పటి నుంచి చాలా మందిలో ఆందోళన నెలకొంది. 2016 డిమోనిటైజేషన్ తర్వాత తరువాత 2000 రూపాయల నోటును విడుదల చేసిన తెలిసిందే. మే 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీలోపు 2000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చని ఆర్‌బీఐ ప్రకటించింది. సెప్టెంబర్ 30 వరకు చెలామణిలో ఉంటాయని పేర్కొంది. అయితే బ్యాంక్‌కు వెళితే ఒక్కసారి కేవలం 10 నోట్లను మార్చుకునే అవకాశం మాత్రమే ఉంటుంది. బ్యాంకులే కాకుండా ఆర్‌బీఐకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లి రూ.2000 నోటును ఛేంజ్ చేసుకోవచ్చు.
బ్యాంక్‌కు వెళ్లకుండా ఇలా..
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు బ్యాంకుకు వెళ్లకుండా.. సమీపంలోని బిజినెస్ కరస్పాండెంట్ల వద్ద నోట్లను మార్చుకోవచ్చని ఆర్‌బీఐ వెల్లడించింది. 2006 సంవత్సరంలో బ్యాంకింగ్ యేతర మధ్యవర్తుల వలె వ్యవహరించే బిజినెస్ కరస్పాండెంట్లను ఆర్‌బీఐ ఆమోదించిన విషయం తెలిసిందే. వీరి ద్వారా గ్రామాల్లో నివసించే ప్రజలు కూడా అన్ని సౌకర్యాలను పొందుతున్నారు.
వీరు బ్యాంకుల మాదిరే పనిచేస్తున్నారు. గ్రామంలో నివసించే ప్రజలకు బ్యాంకు ఖాతాలు తెరవడానికి.. డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి సహకరిస్తున్నారు. బిజినెస్ కరస్పాండెంట్ సెంటర్‌ను సందర్శించి మీ వద్ద ఉన్న రూ.2000 నోట్లను ఈ ఈజీగా మార్చుకోవచ్చు. అయితే ఇక్కడ రెండు నోట్లను మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది. అంటే రోజులో రూ.4 వేల వరకు నోట్లను మార్చుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. ఇందుకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు.
డిపాజిట్ మిషన్ల ద్వారా కూడా రూ.2 వేల నోటును మార్చుకోవచ్చు. ఇందులో మీకు ఎలాంటి లిమిట్ ఉండదు. రోజుకు ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. అయితే ఒకే బ్యాంక్ ఖాతాలోకి ఎక్కువ మొత్తంలో నగదు డిపాజిట్ అయితే బ్యాంక్ అధికారులకు అనుమానం వస్తుంది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. మీ దగ్గర తగిన ఆధారాలు ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
రూ.2 వేల నోటును మార్చుకునేందుకు అన్ని బ్యాంకులు స్పెషల్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నాయి. బ్యాంక్ ఖాతా లేకపోయినా.. రూ.2 వేల నోటును మార్చుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. అకౌంట్ లేదని బ్యాంకులు నిరాకరించడానికి వీలులేదు. ఒక రోజులో గరిష్టంగా రూ.20 వేల వరకు మార్చుకోవచ్చు.
Also Read: IPL 2023 Playoffs: మారిపోయిన ప్లేఆఫ్స్ లెక్కలు.. నాలుగు జట్లు ఔట్.. ఒక బెర్త్‌కు మూడు టీమ్‌లు ఫైట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి