29న స్పీకర్‌ను కలవనున్న వైకాపా ఎంపీలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలకు లోక్ సభ స్పీకర్ కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది.

Last Updated : May 22, 2018, 11:28 AM IST
29న స్పీకర్‌ను కలవనున్న వైకాపా ఎంపీలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఈనెల 29న స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలవనున్నట్లు ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. రాజీనామాలపై ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కితగ్గేది లేదన్నారు. తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తారన్న నమ్మకం ఉందన్న ఆయన.. ఉపఎన్నికలు వస్తే తప్పక గెలిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ నిరవధిక వాయిదా పడిన అనంతరం వైకాపా ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసిన విషయం విదితమే. స్పీకర్ ఫార్మాట్‌లో రూపొందించిన రాజీనామా పత్రాలను పరిశీలించిన సుమిత్రా మహాజన్.. తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ఎంపీలను సూచించారు. అయితే రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని స్పీకర్‌ను కోరారు. ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైఎస్సార్‌ సీపీ ఎంపీలు ఆమరణ దీక్ష చేసిన విషయం తెలిసిందే.  

 

Trending News