Tirupati Bypoll: ఆంధ్రప్రదేశ్ తిరుపతి ఉపఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారుతోంది. అధికార పార్టీ నుంచి చేజిక్కించుకునేందుకు ప్రతిపక్షాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ప్రభుత్వ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.
ఏపీలో త్వరలో అంటే ఏప్రిల్ 17వ తేదీన తిరుపతి ఉప ఎన్నిక(Tirupati Bypoll) జరగబోతోంది. తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ ఆకస్మిక మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. కాగా ఈ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పోటీ పడుతుండగా, బీజేపీ-జనసేన పొత్తుతో(Bjp-Janasena alliance) బీజేపీ నేత, మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ బరిలో దిగారు. ఇక అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి కొత్తగా డాక్టర్ గురుముూర్తి బరిలో దిగారు. అధికార పార్టీ నుంచి ఈ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు ప్రతిపక్షాలు సకల ప్రయత్నాలు చేస్తున్నాయి.
అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం మెజార్టీ పైనే దృష్టి సారించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాలే తిరుపతి ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీని తీసుకొస్తాయని మంత్రి అదిమూలపు సురేష్ ( Minister Adimulapu suresh) ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు టీడీపీని నమ్మే స్థితిలో లేరని ఈ విషయం తెలియక ఆ పార్టీ నేతలు ఇంకా గెలుస్తామనే భ్రమల్లో బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు వైస్సార్‌సీపీ ఎంపీలు గొర్రెలంటూ నోరు పారేసుకోవడం సరైన పద్ధతి కాదంటూ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ(Telugu Desam party) ఎంపీలు సింహాలో లేక గుంటనక్కలో ఈ ఉప ఎన్నికల్లో తిరుపతి ప్రజలే తమ ఓటు ద్వారా తేలుస్తారన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను కేవలం స్వార్థం కోసం తాకట్టు పెట్టి ,ప్యాకేజీకి కక్కుర్తి పడింది టీడీపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ ( Corona second wave) రూపంలో మళ్లీ తన ప్రతాపం చూపిస్తున్న నేపధ్యంలో స్కూళ్ల లో నిబంధనలు పాటించకుండా విద్యార్థుల ఆరోగ్యంతో ఆడుకుంటే ఆ స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also read: AP CM YS Jagan: సతీమణితో కలిసి కోవిడ్-19 టీకా తీసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook