Ysr Congress Party: నారా లోకేష్‌పై సెటైరికల్ పంచ్‌లు విసిరిన విజయసాయి రెడ్డి

Ysr Congress Party: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి, టీడీపీ నేత నారా లోకేష్ మధ్య సెటైరిక్ వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఛలోక్తులు విసిరారు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 27, 2022, 03:37 PM IST
 Ysr Congress Party: నారా లోకేష్‌పై సెటైరికల్ పంచ్‌లు విసిరిన విజయసాయి రెడ్డి

Ysr Congress Party: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి, టీడీపీ నేత నారా లోకేష్ మధ్య సెటైరిక్ వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఛలోక్తులు విసిరారు. 

వైసీపీ నేత విజయసాయి రెడ్డి వర్సెస్ టీడీపీ నేత లోకేష్ మధ్య ట్విట్టర్ వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతుంటాయి. నారా లోకేష్‌పై వీలైనంతవరకూ వ్యంగ్యంగా సమాధానం చెబుతుంటారు విజయసాయి రెడ్డి. ఇప్పుడు మరోసారి అదే జరిగింది. పప్పు నాయుడూ..అర్ధం పర్ధం లేని నీ కామెడీకి జనం నవ్వుకుంటున్నారంటూ విజయసాయి రెడ్డి కామెంట్ చేశారు. 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖకు క్యాంప్ మారిస్తే టీడీపీకు వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో సీట్లు పెరుగుతాయని టీడీపీ నేత నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే విశాఖలో అరాచకం, భూకబ్జాలు పెరిగిపోయాయని..ముఖ్యమంత్రి అక్కడికి వెళితే ఇంకా పెరుగుతాయని లోకేష్ తెలిపారు. పరిపాలన ఒకేచోట, అభివృద్ధి వికేంద్రీకరణ తమ విధానమని నారా లోకేష్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో 5.40 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. అభివృద్ది చేయలేక..మూడు రాజధానులపై పడుతోందని దుయ్యబట్టారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి శ్రీలంక ఆర్ధిక పరిస్థితికి సమానంగా ఉందన్నారు. చంద్రబాబు విజనరీ అయితే..జగన్ ప్రిజనరీ అని ఎద్దేవా చేశారు. 

ఈ వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకు ఎందుకు ఓటేశామని బాథపడుతూ..జగన్ గారికి విశాఖవాసులు బ్రహ్మరథం పడుతున్నారని స్పష్టం చేశారు. విశాఖపట్నం కార్పొరేషన్ సహా ఉత్తరాంధ్ర మున్సిపల్, పంచాయితీ ఎన్నికల ఫలితాలు చూడలేదా పప్పు నాయుడూ అని వ్యాఖ్యానించారు. అర్ధం పర్ధం లేని నీ కామెడీ చూసి జనం నవ్వుకుంటున్నారని చెప్పారు. 

Also read: Bus Accident: భాకరాపేట ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు పరిహారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News