YS Jagan: ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట ప్రారంభించనుంది. వైసీపీకు మొదట్నించి అడ్డాగా ఉన్న రాయలసీమ నుంచే పోరాటం ప్రారంభించనున్నారు. రైతు సమస్యలపై రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టేందుకు నిర్ణయించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గట్టు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నెల 13న అనంతపురం నుంచి రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలకు దిగనుంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి రాయలసీమ జిల్లాలు వైఎస్ జగన్‌కు వెన్నంటిగా నిలిచాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అనంతపురం జిల్లాలో భారీ దెబ్బ తగిలింది. అందుకే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సాధించే క్రమంలో వైఎస్ జగన్ రాయలసీమపై దృష్టి సారించారు. ప్రజాక్షేత్రంలో వెళ్లడం ద్వారా తిరిగి ఆదరణ పొందవచ్చనేది జగన్ నమ్మకం. గత ఎన్నికల్లో ఓటమి పాలైనా 40 శాతం ఓట్లు దక్కాయి. కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ వంటి హామీల కారణంగా 10 శాతం ఓట్లు తగ్గిపోయాయనేది పార్టీ వర్గాల విశ్లేషణ. 2019 ఎన్నికల్లో కూడా అంతకు ముందున్న టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటూ ప్రజల్లోకి వెళ్లింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో అటు ప్రజలు, ఇటు కేడర్‌తో జగన్ సంబంధాలు తెగిపోయాయనేది ప్రధాన విమర్శగా ఉంది. ఈ క్రమంలో మరోసారి ఆ తప్పు జరగకుండా ఉండాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులతో, ప్రజలతో మమేకం అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటినా సూపర్ సిక్స్ అమలు కాకపోవడంపై ప్రజల్లో తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అటు రైతు సమస్యలపై ఈ నెల 13 వతేదీన రాష్ట్రవ్యాప్తం నిరసనలు చేపట్టనుంది. ఈ నిరసనల్ని అనంతపురం నుంచి స్వయంగా వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. అనంతపురం ర్యాలీ నుంచే ప్రభుత్వ వైఖరికి నిరసనగా సమరశంఖం పూరించనున్నారు.
Also read: Best Foods: చలికాలంలో గర్భిణీలు తప్పక తినాల్సిన 5 ఫుడ్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.