Sajjala on NDA Alliance: ఎన్డీయేలో ఆహ్వానం ఎప్పుడో వచ్చింది, అందుకే చేరలేదు

Sajjala on NDA Alliance: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. అధికార పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుంటే ప్రతిపక్షాలు తెలుగుదేశం-జనసేన-బీజేపీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. అభ్యర్ధుల ఎంపీక దాదాపుగా ఖరారైంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృస్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమౌతున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 26, 2024, 01:20 PM IST
Sajjala on NDA Alliance: ఎన్డీయేలో ఆహ్వానం ఎప్పుడో వచ్చింది, అందుకే చేరలేదు

Sajjala on NDA Alliance: ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకు వైఎస్ జగన్‌కు ఉన్న సంబంధం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వైసీపీకు బీజేపీకు మధ్య ఎలాంటి సంబంధముందో తెలిపారు. చాలాకాలంగా మోదీతో జగన్ సంబంధంపై ప్రచారంలో ఉన్న అనేక అంశాలకు క్లారిటీ ఇచ్చారు. ప్రదాని మోదీకు ముఖ్యమంత్రి జగన్ అత్యంత విదేయుడిగా ఉంటారనే టాక్ ఉంది. దీనికితోడు బీజేపీపై లేదా మోదీపై జగన్ ఎప్పుడూ నేరుగా విమర్శించిన పరిస్థితి లేదు. 

ప్రధాని నరేంద్ర మోదీతో, బీజేపీతో జగన్‌కు ఉన్న సంబంధం కేవలం ప్రభుత్వపరమైందేనని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మద్య సంంబంధాలే తప్ప మరొకటి కాదన్నారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించినట్టు తెలిపారు. 

ఎన్డీయేలో చేరమనే ఆహ్వానం తమకు ఏనాడో వచ్చినా తామే నిరాకరించినట్టు చెప్పారు. పొత్తు పెట్టుకుంటే తేడాలు వస్తాయనే ఆ ఆలోచన చేయలేదన్నారు. గతంలో మోదీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు బయటికొచ్చిన తరువాత మోదీపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని అలా తాము అవకాశవాదుల్లో మాట్లాడలేమని సజ్జల వ్యాఖ్యానించారు. రాజకీయ విబేధాల్ని కుటుంబ విబేధాలుగా చూపిస్తూ పబ్బం గడుుపుకునేందుకు చంద్రబాబు అండ్ కో ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్‌కు, షర్మిలకు మధ్య ఉన్నది కేవలం రాజకీయపరమైన విబేధాలేనన్నారు. ఒక అన్నగా చెల్లెలి పట్ల ఎంత ప్రేమ ఉండాలో అంతా జగన్‌కు ఉందన్నారు. ఏపీ ఎన్నికల్లో షర్మిల ప్రబావం ఉండదన్నారు. 

Also read: AP Elections 2024: ఈసీ మరిన్ని ఆంక్షలు, ఇంటింటి ప్రచారానికీ అనుమతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News